/rtv/media/media_files/2025/08/29/rajasaab-2025-08-29-18-51-55.jpg)
RajaSaab
RajaSaab Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న కొత్త సినిమా 'ది రాజా సాబ్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కొంతకాలంగా షూటింగ్ గ్యాప్స్ వల్ల ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు పనులన్నీ చక చకా పూర్తవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ హారర్ కామెడీ చిత్రం 2026 జనవరి 9న, సంక్రాంతి పండుగ సందర్బంగా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.
Producer #VishwaPrasadTG garu about the much-awaited #RajaSaab release date ❤️🔥
— Shreyas Media (@shreyasgroup) August 28, 2025
Join Us For Exclusive Updates 🔗 https://t.co/TmUHISVWwa
Super Hero #TejaSajja Rocking Star #Manoj#Mirai#SuperYodha#ShreyasMedia#ShreyasGrouppic.twitter.com/W934C9aCp6
ఈ సినిమాకి దర్శకుడు మరుతి కాగా, నిర్మాణ బాధ్యతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకున్నారు. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు ₹400 కోట్లు. గతంలో రాజా డీలక్స్ అనే టైటిల్ పై పలు వార్తలు వైరల్ అయినప్పటికీ, ఇప్పుడు ది రాజా సాబ్ అనే పేరును ఫైనల్ చేసి టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభించింది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. బోమన్ ఇరానీ, సునీల్ శెట్టి లాంటి ప్రముఖ నటులు కూడా ఈ ప్రాజెక్టులో నటిస్తున్నారు.
సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ చివర్లో షూటింగ్ పూర్తి చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. అయితే మొదట 2023 సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, ఇండస్ట్రీ కార్మికుల సమ్మె, ఇతర కారణాలతో వాయిదాలు పడ్డాయి.
Also Read: డార్లింగ్ మామూలోడు కాదుగా.. 'రాజాసాబ్' పార్ట్ 2 కూడా..!
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో మొదటి హారర్ మూవీ కావడం విశేషం. ఈ సారి మాత్రం మేకర్స్ గట్టి ప్లాన్‌తో రాబోతున్నారు. ఒక పెద్ద థియేటర్ సెట్‌ను నగర శివార్లలో వేశారని, అక్కడే కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ నవంబర్ నెలలో 15 రోజుల కాల్‌షీట్ కేటాయించగా, 20 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. అదే సమయంలో సినిమాకు అవసరమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు కూడా పక్కా ప్రణాళికతో జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పాత్ర తాతగా, మరొకటి మనవడిగా ఉండొచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ లేదు.
Also Read: ప్రభాస్ "రాజా సాబ్" లో భారీ సర్ ప్రైజ్! ఐటమ్ నెంబర్ కోసం స్టార్ హీరోయిన్ రంగంలోకి
'ది రాజా సాబ్' సంక్రాంతి రిలీజ్..
ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుండటంతో, అదే సమయంలో చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వారం ప్రసాద్ గారు, నవీన్ పొలిశెట్టి - మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రోజు, విజయ్ నటించిన జన నాయకన్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద హోరాహోరీ పోటీ తప్పకపోవచ్చు.
కానీ ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే రిలీజ్ డేట్‌పై మిక్స్‌డ్ కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది విడుదల మరలా వాయిదా పడుతుందేమో అని అనుమానం వ్యక్తం చేయగా, మరికొంత మంది మాత్రం "సోలో రిలీజ్ కావాలి, స్క్రీన్ సమస్యలు ఉండకూడదు" అంటూ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!
మొత్తంగా చూస్తే, ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ది రాజా సాబ్" సినిమా, సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతోంది.