RajaSaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!

'రాజాసాబ్' నుంచి విడుదలైన మరో పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈరోజు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

New Update

RajaSaab: 'బాహుబలి' విజయం తర్వాత ప్రభాస్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూడనంతగా బిజీ అయిపోయారు. హిట్టు, ప్లాప్ పక్కన పెడితే వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఒకేసారి  నాలుగు పైగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోనే మోస్ట్ బీజీయస్ట్ హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో 'రాజాసాబ్' ఒకటి. కామెడీ హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మరో పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. 

సంజయ్ దత్ పోస్టర్

ఈరోజు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో సంజయ్ దత్ లుక్  తెల్లని వెంట్రుకలతో ఒక సన్యాసిలా కనిపిస్తూ భయంకరంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్ర పేరు 'సంజు బాబా' అని తెలిపారు.  థియేటర్స్ లో మిమల్ని పూర్తిగా కదిలించే  భయంకరమైన పాత్రను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సంజయ్ దత్ పోస్టర్ విడుదల చేశారు. 

వింటేజ్ ప్రభాస్ వైబ్స్ 

బాహుబలి తర్వాత ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లలో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించిన ప్రభాస్.. 'రాజాసాబ్' లో తనలోని కామెడీ యాంగిల్ ని మళ్ళీ పరిచయం చేయబోతున్నారు. బుజ్జిగాడు, యోగి వంటి  సినిమాల్లో కామెడీ పంచులు, డైలాగులతో అలరించిన ఆ వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో ఆ వింటేజ్ వైబ్ ని రుచి చూపించారు డైరెక్టర్ మారుతి.  ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ థమన్ సంగీతం మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో థమన్ బీజీఎం ఆకట్టుకుంది. 

ఇందులో ప్రభాస్ జోడీగా ఇద్దరు యంగ్ బ్యూటీస్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీటీవి గణేష్, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, కమెడియన్ సత్య, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

'రాజాసాబ్' తో పాటు ప్రభాస్ మరో మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు. సలార్, కల్కి సీక్వెల్స్ తో పాటు సందీప్ రెడ్డి వంగా  'స్పిరిట్' త్వరలో ప్రారంభం కానుంది. 'స్పిరిట్' ప్రభాస్  పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేయలేదు. దీంతో పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ లుక్, క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

Also Read: Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ గూస్ బంప్స్ .. సెట్స్ నుంచి లీకైన సీన్ వైరల్!

Advertisment
తాజా కథనాలు