Samantha: పార్టీలో బాలీవుడ్ హీరోతో డాన్స్ ఇరగదీసిన సమంత.. వీడియో వైరల్

సమంత 'సిటాడెల్' వెబ్ సీరీస్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ముంబైలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో సామ్, వరుణ్ ధావన్ 'నైన్ మటక్కా' పాటకు డాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

New Update

Samantha- Varun Dhawan : అనారోగ్య సమస్యల కారణంగా  సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న సామ్.. ఇటీవలే సిటాడెల్- హానీ బన్నీ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 'ఫ్యామిలీ మెన్'  ఫేమ్  రాజ్ & డీకే తెరకెక్కించిన ఈ సీరీస్ ఓటీటీలో  రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ముంబైలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సిటాడెల్ టీమ్ అంతా హాజరై సందడి చేశారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

సమంత, వరుణ్ ధావన్ డాన్స్ 

అయితే ఈ పార్టీలో వరుణ్ ధావన్, సమంత డాన్స్ ఇరగదీశారు. వీరిద్దరి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  కీర్తి సురేష్ , వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న 'బేబీ జాన్' సినిమాలోని 'నైన్ మటక్కా' పాటకు స్టెప్పులేశారు. ఈ పార్టీకీ సంబంధించిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.  ప్రస్తుతం సామ్ తన సొంత ప్రొడక్షన్ ట్రాలాల బ్యానర్ పై  'మా ఇంటి బంగారం'  సినిమా చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటుడు, కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు