Samantha Viral Post: నా దృష్టిలో బెస్ట్ హీరోయిన్స్ వాళ్ళే.. సమంత వైరల్ పోస్ట్..

'ఏం మాయ చేసావే' తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన బ్యూటీ క్వీన్ సమంత తాజాగా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో తనకి ఇష్టమైన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్, అనన్య పాండే నటన అంటే తనకి ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.

New Update
Samantha Viral Post

Samantha Viral Post

Samantha Viral Post: సమంత.. 'ఏం మాయ చేసావే'(Em Maya Chesave) తో టాలీవుడ్ కు పరిచయమై కొన్నాళ్లుగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్. ఒకానొక టైం లో వరుస విజయాలను సాధించి ప్రేక్షకులలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది. వయసుతో సంబంధం లేకుండా  చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ఇష్టపడే హీరోయిన్. హిట్స్ & ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా  తనకున్న టాలెంట్ తో అతి తక్కువ టైంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి స్టార్ డమ్ సంపాదించుకుంది. 

Also Read: Anushka Sarma: కోహ్లీ సూపర్‌ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే!

కెరీర్ స్టార్టింగ్ నుండే బడా హీరోల మూవీస్ లో ఛాన్సులు దక్కించుకుంది సమంత.  ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రారంభం అయిన ఆమె ప్రయాణం, 'బృందావనం', 'దూకుడు', 'ఈగ', ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సమ్థింగ్ సమ్థింగ్’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘అత్తారింటికి దారేది’, ‘ఆటోనగర్ సూర్య’, ‘యశోద’, ‘ఓ బేబీ’, ‘జాను’, ‘ఖుషీ’ వంటి సినిమాలతో దోసుకెళ్ళిపోయింది. 

రియల్ లైఫ్ లో ఎన్ని బాధలు, కష్టాలు ఎదుర్కొన్నా, సినిమాలతో తన అభిమానులను ఎప్పుడూ సంతోషపరుస్తూనే ఉంటుంది. సినిమాల్లోనే కాదు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. తాజాగా సిసిల మీడియా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకుంది. ఈ వీడియోలో, ఇండస్ట్రీలోని బెస్ట్ హీరోయిన్ల గురించి మాట్లాడింది. ‘అమరన్’ సినిమాలో సాయిపల్లవి నటన గురించి సమంత ప్రస్తావిస్తూ, ఆమె ఫర్మామెన్స్ అద్భుతంగా ఉందని చెప్పింది. అలాగే, ‘సూక్ష్మదర్శినిలో’ నజ్రియా, ‘జిగ్రాలో’ అలియా భట్, ‘కంట్రోల్‌లో’ అనన్య పాండే చెబుతూ వాళ్ళ నటన తనకి ఎంతగానో నచ్చింది అని ప్రశంసించింది. 

SAMANTHA
SAMANTHA

 

Also Read: Raja Singh:రేపు అయినా నీ తల నరికేస్తాం....రాజాసింగ్‌ కు బెదిరింపు ఫోన్లు!

Also Read: Telangana:టికెట్‌ పై లేకపోయినా సరే..కట్టాల్సిందే ..ఎలక్ట్రిక్ బస్సులో గ్రీన్‌ ట్యాక్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు