Gun Fire: ల్యాండ్‌ అవుతున్న విమానం పై దుండగులు కాల్పులు!

హైతీలో ఓ అమెరికా విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అవుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని దారి మళ్లించారు.

New Update
gunfire

Gun Fire:

కరేబియన్‌ దేశం హైతీలో ఓ అమెరికా విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అవుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. 

Also Read:  Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో

ఈ ఘటనలో విమాన సిబ్బంది ఒకరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...స్పిరిట్‌ ఎయిర్ లైన్స్‌ కు చెందిన ఓ విమానం ఫ్లోరిడా నుంచి సోమవారం ఉదయం హైతీ రాజధాని పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ ఎయిర్‌ పోర్టు కు చేరుకుంది. అయితే అప్పటికే ఈ ప్రాంతంలో గ్యాంగ్‌ వార్‌ ముదిరింది.

Also Read:  AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..!

ఈ క్రమంలోనే ల్యాండింగ్‌ కు 100 అడుగుల ఎత్తులో ఉండగా దుండగులు విమానం పై కాల్పులు జరిపారు. దీంతో విమానాన్ని వెంటనే డొమినికన్‌ రిపబ్లికన్ కు మళ్లించారు. ఈ కాల్పుల్లో విమాన సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు స్పిరిట్‌ ఎయిర్‌ లైన్స్‌ వెల్లడించింది. 

Also Read: Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనే..!

విమానం డొమినికన్‌ రిపబ్లికన్‌ లో ల్యాండ్‌ అయిన తర్వాత తనిఖీలు నిర్వహించగా..వెలుపలి భాగంలో తూటాలు తగిలిన గుర్తులు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. 

Also Read:  BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం

తెలుపు, పర్పుల్ కలర్ విమానాలతో ఇంత కాలం ప్రయాణికలకు సేవలందిచిన విస్తారా ఫ్లైట్స ఇక మీద కనిపించవు. టాటా గ్రూప్‌ (51%), సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (49%) సంయుక్తంగా నడిపిన సంస్థే విస్తారా. 2015 దీనిని ప్రారంభించారు. కానీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఇప్పుడు విస్తారాను.. టాటా గ్రూపుకే చెందిన మరో పెద్ద ఎయిర్ కంపెనీ ఎయిరిండియాతో విలీనం చేస్తున్నారు. విలీనం తర్వాత కూడా ఇందులో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు 25.1 శాతం వాటా ఉండబోతోంది. ఎయిరిండియాలో విస్తారా విలీనం తరవాత మరో రూ.3,195 కోట్లను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడిగా పెట్టనుంది.

విస్తారా ఫ్లైట్ మొదట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళందో చివరి ఫ్లైట్ కూడా అదే రూట్‌లో ప్రయాణించనుంది. విస్తారాకు చెందిన యూకే 986 విమానం ముంబయి నుంచి ఢిల్లీకి నిన్న రాత్రి 10.50 గంటలకు బయల్దేరి వెళ్ళంది. దీంతోపాటు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన యూకే 115 విమానం కూడా రాత్రి 11.45 గంటలకు వెళ్ళింది. సరిగ్గా పదేళ్ళ క్రితం 2015లో జనవరి 9న ప్రారంభమైన విస్తారా తన విమానం సర్వీసును ఢిల్లీ- ముంబయి మధ్యే నడిపారు. ఇప్పుడు ఇవాల్టి నుంచి విస్తారా  విమానాలో కోడ్‌ ‘యూకే’ తెరమరుగై.. ఆ స్థానంలో ఏఐ2XXXX పేరుతో కొత్త కోడ్‌ వస్తుంది.

పదేళ్ళు తన సేవలను అందించిన విస్తారాకు ప్రయాణికులు చివరి రోజు ఆ సంస్థకు గ్రాండ్ గా వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో గుడ్ బై చెబుతూ పోస్టులు పెట్టారు. భారత దేశానికి అత్యంత ఇష్టమైన క్యారియర్లలో ఒకటైన విస్తారాకు కృతజ్ణతలు తెలిపారు. దాంతో పాటూ విస్తారాతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. వారి ప్రయాణ అనుభవాలలో మర్చిపోలేని విషయాలను గుర్తు చేస్తూ.. వారి చివరి ఫ్లైట్ ఫొటోలు , జ్ఞాపకాలు షేర్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు