Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను చంపేందుకు కుట్ర.. అర్థరాత్రి ఇంటిని చుట్టేసిన ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్!

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హత్యకు మరోసారి కుట్ర జరిగింది. జితేంద్ర కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి సల్మాన్ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించగా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానస్పదంగా ఇంటి దగ్గరలో తిరుగుతున్న ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

New Update

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హత్యకు మరోసారి కుట్ర జరిగింది. జితేంద్ర కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించగా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానస్పదంగా ఇంటి దగ్గరలో తిరుగుతున్న ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అయితే జితేంద్ర మాత్ర సల్మాన్‌ను కలిసేందుకు ఇంట్లోకి వెళ్లాలనుకున్నానని విచారణలో చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం ఇంటి దగ్గరలోనుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరగా ఆగ్రహానికి గురయ్యాడు. మళ్లీ సాయంత్రం సల్మాన్‌ ఇంటి వద్ద కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో మరో వ్యక్తి కారు వెనక నక్కి లోపలికి ప్రవేశించాడు. సెక్యూరిటీ అతడిని అడ్డుకుని బాంద్రా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అరెస్టు చేశారు. అతను సల్మాన్‌ఖాన్‌ను కలిసేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. అయితే అనుమానితులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: ముంబైలో అటాక్‌కు జ్యోతి బిగ్ స్కెచ్.. ఆ ప్రాంతాల్లో వీడియోలు తీసి పాక్‌కు.. వెలుగులోకి సంచలన విషయాలు!

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు ప్రాణహాని ఉన్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది బాంద్రాలోని సల్మాన్‌ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద కాల్పులు జరిపారు. మరోసారి అనుమానితులు ఇంటిని చుట్టుముట్టడంతో సల్మాన్ భద్రతపై ఉత్కంఠ నెలకొంది. 

Also Read: రూ.15 వేల పాక్‌ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత

salman-khan | bishnoi-gang | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు