/rtv/media/media_files/kGhZepOwE7kYXfzv83Q7.jpg)
Inter Board
TS Inter Students: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వచ్చే విద్యా ఏడాది నాటికీ పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది. అయితే గతంలో కూడా రెండు సార్లు దీని గురించి ప్రతిపాదనలు చేసినప్పటికీ అమలు కాలేదు. 2018లో గత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలతోపాటు బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 3.91 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా 2018-19 విద్యా సంవత్సరంలో ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అమలు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ 2020-21 విద్యా సంవత్సరంలో అమలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టాలెక్కలేదు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
పెరుగుతున్న డ్రాపౌట్లు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో సుమారు 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కాలేజీలు అన్నీ కూడా నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ఉన్నాయి. దీంతో మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థులు దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనివల్ల ఉదయం భోజనం తెచ్చుకోవడానికి వీల్లేని స్టూడెంట్స్ మధ్యాహనానికే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వ కళాశాలలో డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు హాజరు శాతం కూడా 50% మించడం లేదు. ఈ సమస్యలను నిర్వహించడానికి ప్రభుత్వం 'మిడ్ డే మీల్' స్కీం ప్లాన్ చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేస్తామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
Also Read: Telangana: కొత్త రేషన్ కార్డులు పై మరో కీలక ప్రకటన.. వారి కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులు