Saif Ali Khan పై దాడి.. పోలీసుల అదుపులో మరో నిందితుడు!

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో నిందితుడు ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

New Update
saif ali khan

saif ali khan

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. మరి ఇతను నిందితుడా? కాదా? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

కత్తితో పొడిచి..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దొంగ కత్తితో దాడి చేసి సైఫ్‌ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. 

వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్ కి తరలించాడు. సైఫ్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వెన్నుముక భాగంలో పొడవడంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చింది. అందులో ఉన్న కత్తిని బయటకు తీసి గాయాన్ని సరి చేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలాగే అతని మెడ, చేతులపై ప్లాస్టిక్ సర్జరీలు చేశారు.

ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

సుమారు 2.5 అంగుళాల పొడవైన కత్తి సైఫ్ వెన్నుముకలో దిగిందని, ఇంకో అంగుళం లోతుగా దిగుంటే ఆయన పరిస్థితి మరింత విషమంగా మారేదని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తుంది. సైఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు

Advertisment
తాజా కథనాలు