/rtv/media/media_files/2025/06/19/rukmini-vasanth-in-ntr-neel-project-2025-06-19-17-03-09.jpg)
Rukmini Vasanth in ntr neel project
Rukmini Vasanth: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ (NTR Neel) ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతీ అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో 'సప్త సాగరాల' బ్యూటీ రుక్మిణి వసంత్ (rukmini-vasanth) తాజాగా షేర్ చేసిన పోస్ట్ సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అద్దం సెల్ఫీని షేర్ చేస్తూ, "Tiger Tiger Burning Bright..." అనే క్యాప్షన్ పెట్టారు. అయితే అభిమానులు ఎన్టీఆర్‌ను ప్రేమగా "టైగర్" అని పిలుస్తారు.
ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ లో
దీంతో ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రంలో నటించనున్నారనే వార్తలు మొదలయ్యాయి. అంతేకాదు ఆ ఫొటోలో ఆమె టైగర్ ప్రింట్స్ ఉన్న షర్ట్ ధరించడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. అయితే దీనికి సంబంధించి నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ... రుక్మిణి ఈ పోస్ట్ ద్వారా అనధికారికంగా ప్రకటించింది అంటూ అభిమానులు భావిస్తున్నారు.
Also Read: HBD Kajal Aggarwal: హ్యాపీ బర్త్‌డే కాజల్.. అగ్రతారగా 'చందమామ' సినీ ప్రయాణం ఇదే!
ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుంచి దీపికా పదుకొనె తప్పుకున్న తర్వాత.. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా రుక్మిణి వసంత్ కథానాయికగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి సినిమాతో కన్నడలో పెద్ద హిట్ అందుకుంది. ఈ సక్సెస్ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలను దక్కించుకుంటూ పాన్-ఇండియా స్టార్‌గా ఎదుగుతోంది ఈ బ్యూటీ.
Also Read: Kuberaa Movie: 'కుబేరా' నుంచి ధనుష్ ఎమోషనల్ ట్యూన్.. వింటే కన్నీళ్లు ఆగవు!