HBD Kajal Aggarwal: పంచదార బొమ్మా బొమ్మా'.. అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది నటి కాజల్ అగర్వాల్. 2009 నుంచి 2019 వరకు వరుస సినిమాలతో వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీని ఏలింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. నేడు ఈ ముద్దుగుమ్మ 40 వ వసంతంలోకి అడుగుపెట్టింది. కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ కెరీర్ ని మరోసారి గుర్తుచేసుకుందాం..
ఇండస్ట్రీకి ఎంట్రీ
2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, అదే సంవత్సరం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' భారీ విజయాన్ని సాధించింది. దీంతో కాజల్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం మొదలయ్యాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/kajal-2025-06-19-11-50-00.png)
మలుపు తిప్పిన విజయం (2009-2012)
2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన 'మగధీర' కాజల్ కెరీర్‌కు ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ద్విపాత్రాభినయం చేసిన కాజల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కాజల్ వెనుతిరిగి చూడలేదు! ప్రభాస్‌తో 'డార్లింగ్', జూనియర్ ఎన్టీఆర్‌తో 'బృందావనం' (2010), ప్రభాస్‌తో మరోసారి 'మిస్టర్ పర్‌ఫెక్ట్' (2011), మహేష్ బాబుతో 'బిజినెస్‌మెన్' (2012) ఇలా వరుస విజయాలతో కాజల్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/kajal-2025-06-19-11-44-56.png)
ఈ సమయంలోనే హిందీలో కూడా తన లక్ ని పరీక్షించుకుంది కాజల్. అజయ్ దేవగన్ తో కలిసి తొలిసారి హిందీలో నటించిన 'సింగం' భారీ విజయాన్ని సాధించింది. అదే సమయంలో తమిళ్లో విజయ్ తలపతి జోడీగా వచ్చిన 'తుపాకి' కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇవి కాజల్ మార్కెట్ మరింత పెంచాయి.
నిరాశలు..
అప్పటివరకు వరుస విజయాలతో దూసుకెళ్లిన కాజల్ కాస్త బ్రేక్ పడింది. సరదాగా అమ్మాయితో', 'బ్రహ్మోత్సవం', 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత 2017లో 'ఖైదీ నంబర్ 150', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మళ్ళీ విజయాల బాట పట్టారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/actress-kajal-2025-06-19-11-50-28.png)
కాజల్ కొత్త ట్రెండ్
'పక్కా లోకల్' ఐటమ్ సాంగ్ లో కనిపించి హీరోయిన్ గా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న సమయంలో.. ఇలా స్పెషల్ సాంగ్ నటించడానికి కాజల్ చూపిన తెగువ, ఆమె ప్రొఫెషనలిజాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రల్లో కనిపించే కాజల్, "పక్కా లోకల్" పాటతో తనలోని మరో కోణాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాటలో ఎన్టీఆర్ కి దీటుగా కాజల్ ఎనర్జీ, ఆమె వేసిన స్టెప్పులు, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/19/kajal-ntr-pakka-local-song-2025-06-19-12-39-49.png)
రీ ఎంట్రీ..
2020లో గౌతమ్ కిచ్లు తో పెళ్లి.. ఆ తర్వాత 2022లో బాబు పుట్టడంతో మూడేళ్ళ పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు కాజల్. 2023లో 'భగవంత్ కేసరి' లాంటి భారీ చిత్రంతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సత్యభామ' వంటి మహిళా ప్రధాన చిత్రంతో మరో కొత్త కోణాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, మరిన్ని చిత్రాల్లో నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.
Also Read: Actress Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్రదేశం: బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్