Telusu Kada Trailer: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?

సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన "తెలుసు కదా" ట్రైలర్ సంచలనం రేపింది. సిద్ధు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో ఉండటంపై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ప్రేమపై కొత్త కోణం చూపనున్న ఈ సినిమా అక్టోబర్ 17, 2025న విడుదల కానుంది.

New Update
Telusu Kada Trailer

Telusu Kada Trailer

Telusu Kada Trailer: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), రాశీ ఖన్నా(Raashii Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘తెలుసు కదా’. ఇప్పటికే టైటిల్‌కు మంచి క్రేజ్ వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ఇది ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది, సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

సిద్ధు క్యారెక్టర్‌పై చర్చలు..

ట్రైలర్‌లో చూపించిన సిద్ధు పాత్ర కాస్త కాంట్రవర్షియల్ గా అనిపించింది. ఎందుకంటే, అతను ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో అంటే రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టీలతో లవ్ ట్రాక్‌లో కనిపించడం కొంత మంది ఆడియన్స్‌కి షాకింగ్‌గా అనిపించింది. కొందరు దీనిని వుమనైజర్ క్యారెక్టర్ గా కామెంట్ చేస్తున్నారు. అయితే మరోవైపు, ఇది కేవలం ట్రైలర్‌లో చూపిన భాగమేనని, అసలు కథలో ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయని అభిప్రాయపడుతున్న వారు కూడా ఉన్నారు.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

ట్రైలర్‌లో హైలైట్స్..

ట్రైలర్‌లో ఇంటెన్స్ ఎమోషన్స్, మోడ్రన్ రిలేషన్షిప్స్‌పై కొత్త యాంగిల్, సిద్ధు డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వైవా హర్ష కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వించగా, సిద్ధు చెప్పిన కొన్ని డైలాగ్స్ యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

"అసలు ప్రేమంటే ఏంటి?", "ఒకరినే ప్రేమించాలి అన్న నిబంధన ఎవరికి?", "ఇద్దరినీ ప్రేమించడంలో తప్పేముంది?" లాంటి డైలాగ్స్ సినిమా కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

ఇప్పటివరకు ఈ సినిమాను చాలా మంది ఓ సాఫ్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అనుకున్నారు. కానీ ట్రైలర్ మాత్రం ఈ ఊహను పూర్తిగా మారుస్తోంది. ఇది కేవలం ప్రేమ కథ కాదు, ప్రేమ అనే భావనపై, నేటి తరం దృష్టికోణం ఎలా ఉంటుందన్నదానిపై సీరియస్‌గా మాట్లాడే సినిమా అనిపిస్తోంది.

ఫేమస్ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. మొదటి సినిమాకే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవడం ఆసక్తికర విషయం. ఆమె స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్ ను ప్రెజెంట్ చేయడం ట్రైలర్‌ లోనే బాగా కనిపిస్తోంది.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

అక్టోబర్ 17, 2025న దీపావళి కానుకగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సిద్ధు ఫ్యాన్స్‌తో పాటు, కంటెంట్‌ కు ప్రాధాన్యం ఇచ్చే కామన్ ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు.

"తెలుసు కదా" ట్రైలర్ ప్రేమపై కొత్త కోణాన్ని చూపిస్తూ, సిద్ధు క్యారెక్టర్‌తో షాక్ ఇచ్చింది. కంటెంట్ బలంగా ఉండే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు