Raja Saab: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

ప్రభాస్ "రాజా సాబ్" సినిమా ఆలస్యం VFX సమస్యల వల్ల జరిగింది. పుష్ప కు పని చేసిన ఒక సీనియర్ టెక్నీషియన్ సరిగ్గా పని చేయని కారణంగా లేట్ అయ్యిందని ప్రొడ్యూసర్ తెలిపారు. ఇప్పడు కొత్త VFX టీమ్‌తో పని కొనసాగుతోంది. సంక్రాంతికి 'రాజా సాబ్' విడుదల కానుంది.

New Update
Raja Saab

Raja Saab

Raja Saab: ప్రభాస్(Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాజా సాబ్" మొదటగా 2025 ఏప్రిల్ 10న థియేటర్లలోకి రావాల్సింది ఈ సినిమా, కానీ విడుదల మళ్లీ మళ్లీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అయితే, ఈ చిత్రం 2026 సంక్రాంతికి, అంటే జనవరి 9, 2026న విడుదలకు టార్గెట్ చేస్తున్నారు మేకర్స్.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

ఇంతవరకు ఆలస్యం వెనుక ప్రభాస్ బిజీ షెడ్యూల్ లేదా షూటింగ్ సమస్యలే కారణమని అంతా భావించారు, కానీ అసలు కారణం వేరే ఉంది.

VFX డిపార్ట్‌మెంట్‌లో సమస్య..?

చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.. షూటింగ్ ఆలస్యం కాదు, వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్ వల్లే మొత్తం జాప్యం జరిగిందని. ఈ సినిమా కోసం ఓ సీనియర్ VFX సూపర్‌వైజర్‌ను నియమించారు. కానీ నెలల తరబడి ఆయన ఒక్క సీన్‌కి కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఫినిష్ చేయలేదు.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అదే వ్యక్తి పుష్ప 2 వంటి ఇతర పెద్ద ప్రాజెక్టులపై కూడా పనిచేస్తుండటంతో, రాజా సాబ్ పనుల్లో జాప్యం మరింత పెరిగింది. నిర్మాత మాట్లాడుతూ, "వర్క్ స్పీడ్ కోసం అతనిపై ఒత్తిడి తేవగానే ఆ టెక్నీషియన్ ప్రాజెక్ట్ వదిలేస్తానంటూ బెదిరించాడు" అని వెల్లడించారు.

రాజమౌళితో కూడా వర్క్ చేయలేదు!

ఈ VFX సూపర్‌వైజర్‌తో రాజమౌళి కూడా ఇటీవల వర్క్ చేయడం ఆపేశారట. అంటే ఇది ఒకసారి మాత్రమే కాదు, వరుస ప్రాజెక్టులపై ఈ టెక్నీషియన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించడంలో సమస్యలున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

కొత్త టీమ్‌తో రాజా సాబ్.. 

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, నిర్మాత విశ్వ ప్రసాద్ తన సొంత VFX టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త టీమ్ ఇప్పటికే "మిరాయ్" సినిమా కోసం పని చేసి, మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఇప్పుడు అదే టీమ్ రాజా సాబ్ పనులు చేస్తున్నది. "మిరాయ్" విజువల్ ఎఫెక్ట్స్‌కి వచ్చిన ప్రశంసలు చూస్తుంటే, రాజా సాబ్ కూడా గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉండబోతోంది అని నమ్మకంగా చెప్పొచ్చు.

ఇకపై విడుదల వాయిదా ఉండదని, ఈసారి ఖచ్చితంగా సంక్రాంతికి ప్రభాస్ మాస్ అవతారాన్ని చూస్తామని అభిమానులు ఆశిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు