Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja), శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర(Mass Jathara). పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి భాను బోగరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
Eesari Ganesh Utsavam theatres lo jarupukundham 🤗#MassJathara AUGUST 27th ❤️#MassJatharaOnAug27th pic.twitter.com/TBQEXSAkbS
— Ravi Teja (@RaviTeja_offl) May 29, 2025
Also Read: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!
వినాయక చవితికి థియేటర్స్ లో
తాజాగా మూవీ రిలీజ్ డేట్ (Release date) ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవలే 'Tu Mera Lover' అంటూ విడుదలైన మాస్ బీట్ రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చేలా ఉంది. ఈ సినిమా మాస్ మహారాజ్ అభిమానులకు వింటేజ్ వైబ్స్ ఇచ్చేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. 'ధమాకా ' బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి రవితేజ- శ్రీలీల జోడీగా కనిపించబోతున్నారు.
Also Read: Kannada language:క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?