Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా యానిమల్, పుష్ప2 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన 'సికిందర్' సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత బాలీవుడ్ మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మిక.. ఇటీవలే గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయమైనట్లు(Rashmika Mandanna Injured) సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్.. అమెరికాలో ఏం జరుగుతోంది? రష్మిక మందన్నా(Rashmika Mandanna) షూటింగ్ లకు బ్రేక్ అయితే ఈ గాయం కారణంగా ఆమె కొత్త ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆమె పూర్తి ఆరోగ్యంగా మారడానికి కొంత విరామం తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. రష్మికా మందన్నా, సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న 'సికందర్' చివరి షెడ్యూల్ జనవరి 10 నుంచి ముంబైలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్ కానుకగా విడుదల కానుంది. Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా ఈ సినిమాతో పాటు రష్మిక తెలుగులో గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాలు చేస్తుంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న గర్ల్ ఫ్రెండ్ టీజర్ ఇప్పటికే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో మొదలైన ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న కుబేర త్వరలో విడుదల కానుంది. Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆవేదన Also Read: Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్