Rashmika: ఆ డైరెక్టర్స్ కు సారీ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్

రష్మిక జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా గాయమైన కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో తెలీదు. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నానని తెలిపారు.

New Update
rashmika latest insta post

actress rashmika mandanna

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా  యానిమల్, పుష్ప2 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన 'సికిందర్'  సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత బాలీవుడ్ మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మిక.. ఇటీవలే జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. 

తాజాగా తన గాయం గురించి తెలియజేస్తూ.. కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని  ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. అంతేకాకుండా గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదన్నారు. ఈ మేరకు పోస్ట్ లో.." నూతన సంవత్సర శుభాకాంక్షలు! నేను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డాను. 

Also Read : 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత

పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్‌’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్‌ అయినా వెంటనే షూట్‌లో భాగం అవుతా.." అని రాసుకొచ్చారు. 

కాగా రష్మిక నుంచి త్వరలోనే 'చావా' అనే  బాలీవుడ్ మూవీ రాబోతుంది. విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 'పుష్ప2' వల్ల ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది.

Also Read : ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్

#latest-telugu-news #actress-rashmika-mandanna #rashmika #latest-movie-updates #heroine-rashmika
Advertisment
Advertisment
తాజా కథనాలు