/rtv/media/media_files/2025/03/04/SYOEYeoK13OjjGsnDbXF.jpg)
Ramayana update
Ramayana: బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథలాజికల్ డ్రామా 'రామాయణ'. ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు పార్టులుగా రానుంది. 2026 దీపావళి కానుకగా మొదటి భాగం, 2027 దీపావళికి సెకండ్ పార్ట్ విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇందులో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది.
Also Read: Oscar Awards 2025: జస్ట్ మిస్.. ప్రియాంక చోప్రా 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!
ఆ పాత్రలో కుబ్రా నటించడంలేదు..
అయితే ఈ సినిమాలో శూర్పణఖ పాత్ర కోసం 'సేక్రెడ్ గేమ్స్' ఫేమ్ నటి కుబ్రా సైట్ ను ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుబ్రా దీనిపై క్లారిటీ ఇచ్చారు. శూర్పణఖ పాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చానని .. కానీ ఎంపిక కాలేదని చెప్పింది. కుబ్రా ఇంకా సరదాగా మాట్లాడుతూ.. నా ముక్కు కారణంగా నేను శూర్పణఖ సరిగ్గా సరిపోతానని అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ పాత్రను ఎవరికి ఇచ్చారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అని తెలిపారు.
/rtv/media/media_files/2025/03/04/apeuFMuHlS4cXhkkMgA5.jpg)
ఇది ఇలా ఉంటే ఇందులో కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడిగా, కైకేయి పాత్రలో లారా దత్త, లక్ష్మణుడిగా రవి దూబే, అరుణ్ గోవిల్ దశరథుడిగా, ఇందిరా కృష్ణన్ రాముడి తల్లి కౌసల్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా తారాగణనానికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే 'రామాయణ' సెట్స్ నుంచి లీకైన రణ్బీర్ కపూర్ , సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.