/rtv/media/media_files/2025/01/23/0QpJON02939ExChUoK0b.jpg)
Anuja nominated for Oscars 2025
Oscar Awards 2025: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా 97 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకు హాలీవుడ్ కి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. హాస్యనటుడు కోనన్ ఓ'బ్రెయిన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఇండియా
ఆస్కార్ కి నామినేట్ అయిన 'అనుజ' షార్ట్ ఫిల్మ్ ఒక్క అడుగు దూరంలో ఆస్కార్ ను కోల్పోయింది.
Also Read: Oscar Awards 2025: ప్రియాంక చోప్రాకు ఆస్కార్ జస్ట్ మిస్.. 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!
జస్ట్ మిస్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన అనుజ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ లైవ్ యాక్షన్ కేటగిరీలో 97 వ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. కాగా అదే కేటగిరీలో నామినేట్ అయిన డచ్ సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్ 'ఐయామ్ నాట్ రోబోట్' ఆస్కార్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి విక్టోరియా వార్మర్‌డామ్ దర్శకత్వం వహించారు. ఒక్క అడుగు దూరంలో 'అనుజ' ఆస్కార్ ను కోల్పోవడం ఇండియన్ సినీ ప్రియులను నిరాశకు గురిచేసింది.
షార్ట్ ఫిల్మ్ స్టోరీ..
'అనుజ' షార్ట్ ఫిల్మ్ ఢిల్లీలో నివసిస్తున్న 9 ఏళ్ల బాలిక కథ. ఈ సినిమా కథ 9 ఏళ్ల అనూజ, ఆమె 17 ఏళ్ల సోదరి చుట్టూ తిరుగుతుంది. అనూజ అనే 9 ఏళ్ల బాలిక, ఆమె అక్క పాలక్‌తో కలిసి గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. 9 ఏళ్ల అనూజ జర్నీ ఎలా ఉంటుందో అనేదే సినిమా స్టోరీ. ఆమె తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు, అది ఆమె భవిష్యత్తుతో పాటు ఆమె కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చూపించారు.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!