/rtv/media/media_files/2025/09/08/ramu-rathod-2025-09-08-16-52-50.jpg)
Ramu Rathod
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss Season 9 Telugu) నిన్న రాత్రి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభమైంది. ఈ సారి సెలబ్రెటీలతో పాటు కామానర్స్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు. సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్(Celebreties vs Commenors) గా సీజన్ 9 రసవత్తరంగా సాగనుంది. 8 మంది సెలబ్రెటీస్, 6 మంది కామనర్స్ మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టారు. అయితే సెలబ్రెటీస్ నుంచి సింగర్ రాము రాథోడ్(Ramu Rathod) ఎంట్రీ అందరినీ సర్ప్రైజ్ చేసింది. రామ్ రాథోడ్ బిగ్ బాస్ కి వెళ్తున్నాడని ఎవరు ఊహించలేదు. సోషల్ మీడియాలో కూడా అతడి పేరు పెద్దగా వినిపించలేదు. కానీ స్టేజ్ పై సడెన్ ఎంట్రీతో ఆడియన్స్ ని ఫుల్ సర్ప్రైజ్ చేశాడు. ఎక్కడో మారు మూల గ్రామంలో పుట్టిపెరిగిన రాము తన స్వయం కృషి, పట్టుదలతో.. బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టే స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలో రాము రాథోడ్ జర్నీ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
#RamuRathod song on @iamnagarjuna 🔥#BiggBossTelugu9pic.twitter.com/47je2rGcla
— 👑NAG (@priyathamKING) September 7, 2025
Also Read : ఎవరీ నటి రంగ సుధా.. ఫొటోలు చూస్తే మతిపోతుంది!
రాము రాథోడ్ జర్నీ..
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా, భూత్పూర్ మండలం, గోపాల్ పూర్ తాండాలో రామ్ రాథోడ్ పుట్టిపెరిగాడు. అయితే అతడికి చిన్నప్పటి నుంచి పాటలన్నా, డాన్సన్నా చాలా ఇష్టమట. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్, స్కూల్ ఈవెంట్స్ లో కూడా పాటలు, డాన్సులు చేస్తుండేవాడు. అలా పాటలపై మక్కువ పెంచుకున్న రాము యూట్యూబ్ ద్వారా తన టాలెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అప్పటివరకు ఎవరో పాడి, రాసిన పాటలకు డాన్సులు వేసే అతడు.. తానే సొంతంగా పాటలు రాసి కంపోజ్ చేయడం స్టార్ చేశాడు. మొదట "సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ" అనే ఫోక్ సాంగ్ కంపోజ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. ఇది ఊహించని విధంగా యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో రాము ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. జానపద పాటలకు ఆధినిక హంగులు జోడించి యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలు పెట్టాడు.
All the Best Bro Baga adali anukuntuna entertain chestavu anukuntuna 🕺🕺#RamuRathod#BiggBossTelugu9pic.twitter.com/KsY06AYR2T
— ꪜɪᴊᴀʏ💫 (@Think_Crazy09) September 7, 2025
516 మిలియన్ల వ్యూస్ తో రికార్డ్
రీసెంట్ గా "రాను బొంబాయికి రాను" అనే పాటతో సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఈ పాట యూట్యూబ్ లో లక్ష కాదు మిలియన్ కాదు.. ఏకంగా 516 మిలియన్ల వ్యూస్ తో సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసిన ఇదే పాట మారుమోగింది. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో ఈపాటపై లక్షల్లో రీల్స్ వైరల్ అయ్యాయి. పెద్ద పెద్ద సినిమా పాటలు కూడా రాన్నన్ని వ్యూస్ "రాను బొంబాయికి రాను" పాట సొంతం చేసుకుంది. జానపద కళకు డిజిటల్ ప్రపంచంలో ఎంత విలువ ఉందో నిరూపించింది. ఊరుదాటకుండానే.. ప్రపంచమంతా తన పాట వినేలా చేశాడు రాము. తన సహజమైన శైలి, ప్రత్యేకమైన డ్యాన్స్ మూమెంట్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో అతడి క్రేజ్ మరింత పెరిగింది. సినిమాల్లో కూడా అతడి పాటలు పెట్టుకునే స్థాయికి వెళ్ళాడు. ఇటీవలే సందీప్ కిషన్ హీరోగా విడుదలైన 'మజాకా' 'సొమ్మసిల్లి పోతున్నవే రాములమ్మ' పాటను రీమేక్ వెర్షన్ లో యూజ్ చేసుకున్నారు.
Also Read: Andhra King Taluka: ''పప్పీ షేమ్''.. ఆంధ్ర తాలూక నుంచి రామ్ మాస్ బీట్ అదిరింది! సాంగ్ చూశారా