ఆర్‌సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా?

రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

New Update
Rc 16 Kilinkara

Rc 16 Kilinkara Photograph: (Rc 16 Kilinkara)

హీరో రామ్ చరణ్ 16 సినిమా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ఇంకాట టైటిల్‌ను పెట్టలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

ఇది కూడా చూడండి: ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్‌ వాడితే.. చివరికి

నెట్టింట్ వైరల్ అవుతున్న ఫొటో..

ఈ క్రమంలో రామ్ చరణ్ షూటింగ్‌కి వెళ్తూ.. తన ముద్దుల కూతురు క్లింకారను కూడా సెట్స్‌కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చూడండి: JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు..

ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఇటీవల విడుదలైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర నిరాశపరిచింది. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. శంకర్ ఎన్నో అంచనాలతో ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. కానీ సినిమాలో తన మార్క్ మిస్ అయ్యిందని టాక్ వినిపించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కాగా.. గేమ్ ఛేంజర్ మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. అయితే కొంతమంది నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. 

ఇది కూడా చూడండి: బంగారు ప్రియులకు బిగ్ షాక్.. ఆల్ టైం గరిష్టానికి చేరిన పసిడి.. గ్రాము రేటు ఎంతంటే?

ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు