Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఊహించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. నెల రోజుల్లోనే ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 7నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడా భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.
Also Read: Life Style: పడుకునే ముందు వీటిలో ఒకటి తాగడం మర్చిపోవద్దు! ఎందుకంటే..
raa macha, buckle up 😎 the rules are about to CHANGE 👀#GameChangerOnPrime, Feb 7 pic.twitter.com/ewegjT69yL
— prime video IN (@PrimeVideoIN) February 4, 2025
Also Read: Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..! - Rtvlive.com
పైరసీ కాపీలు
అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమా థియేటర్ లో ఉండగానే పైరసీ కాపీలు విడుదల చేయడంతో మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలోని ఓ లోకల్ ఛానెల్ మూవీని ప్రసారం చేయగా..దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిత్రబృందం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ దుశ్చర్యకు పాల్పడినందుకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపిన గాజువాక పోలీసులు.. పైరసీ కాపీని ప్రసారం చేసిన ఆరుగురు ఛానెల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!