/rtv/media/media_files/2025/02/01/CO9kSA53iIW6CfBTs7tt.jpg)
sleep
Life Style: నేటి బిజీ లైఫ్ లో ఉద్యోగం, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేయలేక చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇలా ఒత్తిడి స్థాయిలు పెరగడం మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఎల్లప్పుడూ మనసంతా గందరగోళంగా అనిపించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, వ్యాయామాలు, జాగింగ్ చేయడంతో పాటు కొన్ని ఆరోగ్యపరమైన చిట్కాలు కూడా పాటించాలి. అయితే రాత్రి పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండడంతో పాటు హాయిగా నిద్ర పట్టేందుకు సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఒత్తిడిని తగ్గించే పానీయాలు
లావెండర్ టీ
- లావెండర్ టీని లావెండులా అంగుస్టిఫోలియా మొక్క మొగ్గలను వేడి నీటిలో మరిగించడం ద్వారా తయారు చేస్తారు .లావెండర్ టీలోని యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగడం వల్ల నరాలను శాంతపరిచి.. మంచి నిద్రను కలిగిస్తుంది.
పిప్పరమింట్ టీ
- పుదీనా ఆకుల టీ కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పుదీనా టీ తాగడం వల్ల మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండి.. మంచి నిద్రకు సహాయపడుతుంది.
చమోమిలే టీ
- తెలుగులో దీనిని చామంతి పువ్వు టీ అంటారు. దీనిలోని ఔషధ గుణాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, నిద్ర సమస్యలను తొలగించడంలో చమోమిలే టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రి పడుకునే ముందు చమోమిలే టీ తాగడం వల్ల ఆందోళన తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
వేడి పాలు, తేనె
- వేడిపాలలో తేనే కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది నాడీ కణాలు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే మంచి నిద్ర కోసం గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్రపోవడానికి గంట ముందు దీనిని తాగడం మంచిది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Parenting Tips: తల్లిదండ్రుల ఈ 3 చెడు అలవాట్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయి!