'అన్ స్టాపబుల్' లో 'గేమ్ ఛేంజర్' సందడి.. రామ్ చరణ్ తో పాటూ వాళ్ళు కూడా!

'గేమ్ ఛేంజర్' పప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. చరణ్‌తో పాటు దిల్ రాజు, శంకర్ కూడా ఈ షోలో సందడి చేయనున్నారట. డిసెంబర్ 31న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని సమాచారం.

New Update
ram charan in unstoppable

ram charan in unstoppable

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా 'ఆహా' ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’(Unstoppable) టాక్ షో భారీ ఆదరణను అందుకుంటోంది. ఇప్పటికే ఈ షో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని, ప్రస్తుతం నాలుగో సీజన్‌తో అలరిస్తోంది. ఈ సీజన్‌లో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు షోలో సందడి చేశారు.

ఇటీవలే విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ టాక్ షోకు మరో ప్రత్యేకతను తీసుకురావడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నారు. ఆయన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా ప్రమోషన్‌లో భాగంగా షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 

Also Read: 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

న్యూ ఇయర్ స్పెషల్..

డిసెంబర్ 31న, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చరణ్ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని సమాచారం. అలాగే న్యూ ఇయర్ కానుకగా ఈ ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోకి మొదటిసారి రామ్ చరణ్ రాబోతుండటం విశేషం. గత సీజన్‌లో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు, ఆయన రామ్ చరణ్‌తో ఫోన్‌లో బాలయ్యతో మాట్లాడారు. 

అప్పుడు బాలకృష్ణ, “నా షోకు ఎప్పుడు వస్తావు?” అని అడగ్గా.. చరణ్, “మీరు పిలవడమే ఆలస్యం” అని అన్నారు. ఎట్టకేలకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది. కాగా ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు