Coolie OTT Release: ఓటీటీలోకి 'కూలీ' ఎంట్రీ.. తలైవా వైబ్ అస్సలు మిస్సవకండి!

రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వైజాగ్ పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సైమన్ అనే డాన్, అతని చీకటి వ్యవహారాల మధ్య దేవా (రజిని) ఎంట్రీతో ఏం జరిగిందనేదే కథ. అమెజాన్ ప్రైమ్‌లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

New Update
Coolie on Prime

Coolie OTT Release Date

Coolie OTT Release Date: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన తాజా చిత్రం ‘కూలీ’(Coolie Movie) ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్లు కూడా అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Coolie on Prime

ఇప్పుడు, ఈ సినిమా సెప్టెంబర్ 11 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Coolie on Amazon Prime) స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా థియేటర్‌కి వెళ్లలేని ప్రేక్షకులకు ఓటీటీలో చూసే అవకాశం దక్కింది. అయితే హిందీ వెర్షన్‌ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. అది వేరే ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Also Read: ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది..! కూలీ OST వచ్చేసిందిగా..

Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్‌ ఫ్యాన్స్‌ కి పండగే..!

కథలోకి వెళ్తే... (Coolie OTT Release)

'కూలీ' కథ వైజాగ్ పోర్ట్ లో జరుగుతుంది. అక్కడ సైమన్‌ (నాగార్జున) అనే డాన్, ‘కింగ్‌పిన్ లాజిస్టిక్స్’ అనే పేరుతో దిగుమతి, ఎగుమతి వ్యాపారం చేస్తూ ముఠా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. అయితే వ్యాపారం పేరు మీద చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తుంటారు. ఈ ముఠాలో దయాల్ (సౌబిన్ షాహిర్) కీలకంగా ఉంటాడు.

ఈ గ్యాంగ్‌లో పని చేసే రాజశేఖర్ (సత్యరాజ్) అనుకోని పరిస్థితుల్లో చనిపోతాడు. అతనికి దగ్గరి మిత్రుడు దేవా (రజనీకాంత్). ఒకప్పుడు ప్రాణ మిత్రులైన ఈ ఇద్దరూ కొన్ని కారణాల వల్ల 30 ఏళ్లుగా కలుసుకోరు. రాజశేఖర్ మరణ వార్త తెలుసుకున్న దేవా, వైజాగ్ వస్తాడు. అక్కడ నుంచి అసలైన కథ మొదలవుతుంది.

Also Read: మిరాయ్ vs కిష్కింధపురి.. క్లాష్ గెలిచేదెవరు..?

దేవా ఎందుకు వచ్చాడు? సైమన్‌తో దేవాకు ఉన్న లింక్ ఏంటి? కలీషా (ఉపేంద్ర), దాహా (ఆమిర్ ఖాన్), ప్రీతి (శ్రుతి హాసన్) పాత్రలు ఈ కథలో ఎలా కనిపిస్తాయి? అన్నదే సినిమాకి హైలైట్.

Also Read: "ఏటిగట్టు" ఆగిందా..? మెగా మేనల్లుడు క్లారిటీ..!

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. థియేటర్‌లో విడుదలైన నెలరోజుల్లోపే ఓటీటీలో రావడం విశేషం. విడుదలైన రోజు నుంచే సోషల్ మీడియాలో సినిమా మీద కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, రజనీకాంత్ మాస్ అప్పీల్‌తో కలెక్షన్లు మాత్రం దుమ్ము దులిపాయి. ఈ వీక్ ఎండ్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ‘కూలీ’ సినిమాను  మిస్ కాకండి! 

Advertisment
తాజా కథనాలు