/rtv/media/media_files/2025/09/10/coolie-ost-2025-09-10-21-57-06.jpg)
Coolie OST
Coolie OST: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన మాస్ యాక్షన్ డ్రామా "కూలీ" థియేటర్లలో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
సెప్టెంబర్ 11న ఓటీటీలో ‘కూలీ’
ఈ సినిమా సెప్టెంబర్ 11, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Coolie On Amazon Prime) ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో వివిధ భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సినిమాను OTT లో మరోసారి చూసేందుకు సిద్ధవుతున్న ప్రేక్షకులకు, మేకర్స్ మరో ప్రత్యేకమైన అనౌన్స్‌మెంట్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
OTTకి ముందే కూలీ OST.. (Coolie OTT Release)
సినిమా ఓటీటీలో విడుదలయ్యే రోజు కంటే ఒక రోజు ముందే, అంటే సెప్టెంబర్ 10న, ఈ సినిమా అసలైన సంగీతం (OST) ను యూట్యూబ్‌తో పాటు అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో విడుదల చేశారు చిత్రబృందం. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు పెద్ద హిట్స్ అయ్యాయి.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
"I Am the Danger"
"చికిటు"
"మాబ్‌స్టా"
"మొనికా" లాంటి పాటలు సంగీత ప్రియులను ఫిదా చేశాయి.
కేవలం పాటలు కాదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అందుకే OST కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా
స్టార్స్‌తో కూలీ..
ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, ఆయనతో పాటు నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం, పవర్ఫుల్ కథనంతో ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది.
ఇప్పుడు సినిమాను చిన్న బుల్లితెరపై చూడాలనుకునే వారికి, థియేటర్లలో మిస్ అయినవారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, ఓటీటీ రిలీజ్ ముందు OST విడుదల కావడంతో సినిమాపై మళ్ళీ బజ్ క్రియేట్ అయ్యింది.