/rtv/media/media_files/2025/09/10/mirai-vs-kishkindha-puri-2025-09-10-21-30-40.jpg)
Mirai vs Kishkindha Puri
Mirai vs Kishkindha Puri:
ఈ వారం శుక్రవారం (సెప్టెంబర్ 12) తెలుగు బాక్సాఫీస్ వద్ద రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రానున్నాయి. ఒకటి యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా "మిరాయ్"(Mirai Release), మరొకటి హారర్ మిస్టరీ థ్రిల్లర్ "కిష్కిందాపురి"(Kishkindha Puri Release).
తేజ సజ్జా హీరోగా నటించిన "మిరాయ్" మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన "కిష్కిందాపురి" సినిమాను హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు వేర్వేరు జానర్స్ అయినప్పటికీ, ఒకే రోజు విడుదల కావడం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
ఇటీవలి ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్, “మేమే ముందుగా మా విడుదల తేదీని ప్రకటించాం. మిరాయ్ టీమ్ అయితే ముందు తెలియజేసి ఉంటే బాగుండేది” అంటూ ఈ పోటీపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా
అయితే తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడిన సందర్భంగా ఆయన మరో రకంగా చెప్పుకొచ్చారు. “మిరాయ్ టీమ్ కూడా చాలా కష్టపడింది. మనోజ్ గారు, తేజ, కార్తీక్ వీరంతా మంచి స్నేహితులు. వాళ్ల సినిమా కూడా బాగా ఆడాలి అని కోరుకుంటున్నాను,” అంటూ గొప్ప మనసు చూపించారు.
ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైతే ఏదో ఒక సినిమాపై కొంత నెగిటివ్ ప్రభావం ఉంటుంది, అందుకే ముందుగానే ప్లానింగ్ ఉంటే మంచిదని బెల్లంకొండ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. “కొన్ని రోజుల్లో సినిమాలు విడుదల కావడం లేదని థియేటర్లు ఖాళీగా ఉంటాయి. అందుకే స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేయగలిగితే అందరికీ మంచిగా ఉండేదని,” అన్నారు.
ప్రమోషన్‌లో స్పీడ్ పెంచిన బెల్లంకొండ..
ఇదిలా ఉండగా, "కిష్కిందాపురి" సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరోవైపు "మిరాయ్" కూడా మంచి టెక్నికల్ హంగులతో వాస్తవానికి వేరే లెవెల్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
సెప్టెంబర్ 12న ప్రేక్షకులకు రెండు భిన్నమైన జానర్స్ మంచి వినోదం అందించబోతున్నాయి. ఒకటి ఫాంటసీ యాక్షన్, మరోటి హర్రర్ థ్రిల్లర్. ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి..