/rtv/media/media_files/2025/09/10/sambarala-yeti-gattu-2025-09-10-15-54-51.jpg)
Sambarala Yeti Gattu
Sambarala Yeti Gattu: "విరూపాక్ష" లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్(Sai Durga Tej) చేస్తున్న నెక్ట్స్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అదే "సాంబరాల ఏటిగట్టు". ఈ సినిమాను యువ దర్శకుడు రోహిత్ కె.పి డైరెక్ట్ చేస్తుండగా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం తేజ్ గత రెండు సంవత్సరాలుగా శ్రమిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకి దాదాపు రూ.125 కోట్లు ఖర్చవుతోందట. ఇందులో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మీ కథానాయికగా నటిస్తోంది. ఇక సపోర్టింగ్ రోల్స్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణలు నటిస్తున్నారు.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
స్పెషల్ పోస్టర్ రిలీజ్.. (Sambarala Yeti Gattu Poster)
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తేజ్ గంభీరంగా 8 ప్యాక్ బాడీతో కనిపించే లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొంతకాలంగా సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ రాకపోవడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. కానీ తాజాగా మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ, షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల మధ్య వారం నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
Mega Supreme Hero Sai Durgha Tej’s Pan-India Film Sambarala Yeti Gattu (SYG) Enters Crucial Schedule with Peter Hein Spectacular Action Sequence
— UV Communications (@UVCommunication) September 10, 2025
COURTESY : #ANDHRAJYOTHI & #SAKSHI ON 10.09.2025 #SambaralaYetiGattu@IamSaiDharamTej@AishuL_@rohithkp_dir@Primeshowtweets… pic.twitter.com/iWqlSiA3oM
ఇంకా, ఈ షెడ్యూల్‌లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించనున్నారు. దీనికి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం వహించబోతున్నారు. ఇందులో తేజ్‌కు విలన్‌గా బాలీవుడ్లోకి చెందిన ఓ స్టార్ నటుడు కనిపించబోతున్నాడట. ఈ పాత్ర సినిమాకి హైలైట్ కానుందని టాక్.
మొదట్లో దసరాకే సినిమాను విడుదల చేయాలనే అనుకున్నప్పటికీ, ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సమ్మె వల్ల షూటింగ్ ఆగిపోవడంతో, రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ కొత్త విడుదల తేదీను(Sambarala Yeti Gattu Realease Date) ప్రకటించనున్నారని సమాచారం.
Also Read:మొన్న 'మహా అవతార్'.. ఇప్పుడు 'వాయుపుత్ర'.. 3D యానిమేషన్‌లో హనుమాన్ కథ!
ఈ చిత్రానికి టెక్నికల్ క్రూ కూడా బలంగా ఉంది. సినిమాటోగ్రఫీకి వెట్రి పళనిసామి, సంగీతం అజనీష్ లోక్‌నాథ్, ఎడిటింగ్‌కు నవీన్ విజయకృష్ణ పని చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తో పాటు ఇతర భాషల్లో విడుదల చేయనున్నారు.
సాయిదుర్గా తేజ్ కొత్త అవతారంలో కనిపించబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. "సాంబరాల ఏటిగట్టు" తేజ్‌కు మరో బ్లాక్‌బస్టర్ తీసుకురావడమే కాకుండా, పాన్ ఇండియా హీరోగా నిలిపే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి, ఈ సినిమాతో తేజ్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తాడా..? లేదా..? అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.