/rtv/media/media_files/2025/08/12/coolie-cast-remuneration-2025-08-12-11-32-42.jpg)
Coolie Cast Remuneration
Coolie Cast Remuneration: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న ‘కూలీ’(Coolie Movie) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కించిన ఈ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ ఆగస్టు 14న విడుదలకానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. విడుదలకు ముందే రూ.200 కోట్ల లాభం వచ్చిందంటే, రజినీకాంత్ బ్రాండ్ విలువ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే అంత మంది స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాకు నటీనటులు ఎవరు ఎంత పారితోషికం తీసుకున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!
రజినీకాంత్ - దేవా
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/rajinikanth-as-deva-2025-08-12-12-13-16.jpg)
ఈ సినిమాలో ‘దేవా’గా నటించిన హీరో రజినీకాంత్‌కు మొదట రూ.150 కోట్లు రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేయగా, సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి నిర్మాతలు ఆయన రెమ్యూనిరేషన్ రూ.200 కోట్లకు పెంచారు. ఇది సినిమా పరిశ్రమలో ఓ రికార్డు.
లోకేష్ కనగరాజ్
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/lokesh-kanagaraj-2025-08-12-12-09-01.jpg)
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో తొలిసారిగా రజినీకాంత్‌తో కలిసి పనిచేశారు. ఆయనకు రూ.50 కోట్లు పారితోషికంగా చెల్లించారు. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో టాప్ డైరెక్టర్లలో లోకేష్ ఒకరు కావడం విశేషం.
ఆమిర్ ఖాన్ - దహా
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/aamir-khan-as-dahaa-2025-08-12-12-01-59.jpg)
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan), ఈ సినిమాలో “దహా” అనే విలన్ క్యారెక్టర్‌లో కేవలం 15 నిమిషాల ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కానీ ఈ చిన్న పాత్రకే ఆయనకు రూ.20 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారు. ఒకరకంగా ఆమిర్ స్థాయికి ఇది తక్కువే అని చెప్పొచ్చు!
అనిరుధ్ రవిచందర్
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/anirudh-ravichander-2025-08-12-11-58-22.jpg)
ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) తన స్టైల్ మ్యూజిక్‌తో మరోసారి రజినీకాంత్‌కు సూపర్ హిట్ ని అందించారు. ఆయనకు ఈ సినిమా కోసం రూ.15 కోట్లు చెల్లించారు.
Also Read:'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్.. తలైవా ర్యాంపేజ్ మాములుగా లేదుగా..!
కింగ్ నాగార్జున - సైమన్
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/nagarjuna-as-simon-2025-08-12-11-56-57.jpg)
తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన కింగ్ నాగార్జున(King Nagarjuna) 'సైమన్' అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు ఆయనకు రూ.10 కోట్లు రెమ్యూనిరేషన్ ఇచ్చారు.
సత్యరాజ్ - రాజశేఖర్
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/sathyaraj-as-rajasekhar-2025-08-12-11-54-15.jpg)
సత్యరాజ్(Sathyaraj) గారు రాజశేఖర్ అనే పాత్రలో కనిపించనుండగా, ఆయనకు రూ.5 కోట్లు రెమ్యూనిరేషన్ చెల్లించారు.
ఉపేంద్ర - కాలీషా
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/upendra-as-kaleesha-2025-08-12-11-52-00.jpg)
ఇక కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra) 'కాలీషా' అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు రూ.4 కోట్లు రెమ్యూనిరేషన్ ఇచ్చారు.
శృతి హాసన్ - ప్రితి
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/shruti-haasan-as-preethi-2025-08-12-11-49-26.jpg)
శృతి హాసన్(Shruti Haasan) హీరోయిన్‌గా “ప్రితి” అనే పాత్రలో నటిస్తున్నారు. ఆమెకు కూడా రూ.4 కోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వడం జరిగింది.
పూజా హెగ్డే - మోనికా
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/pooja-hegde-as-monica-2025-08-12-11-47-25.jpg)
'మోనికా'సాంగ్ తో అందరినీ ఆకట్టుకున్న పూజా హెగ్డే(Pooja Hegde) ఈ సినిమాకు రూ.3 కోట్లు తీసుకున్నారు.
సౌబిన్ షాహీర్ - దయాల్
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/12/soubin-shahir-as-dayal-2025-08-12-12-23-41.jpg)
వెర్సటైల్ యాక్టర్ సౌబిన్ షాహీర్(Soubin Shahir), 'దయాల్' అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సౌబిన్ కి రూ.1 కోటి రెమ్యూనిరేషన్ ఇచ్చారు.
‘కూలీ’ సినిమా కేవలం కథ, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తోనే కాదు, ఇందులో నటించిన ప్రతీ నటి, నటుడికి భారీ పారితోషికాలు ఇచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. రజినీకాంత్ 50 సంవత్సరాల సినీ ప్రయాణానికి అద్భుతమైన గిఫ్ట్ 'కూలీ'.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఉన్నారు.