Coolie: ఇది కదా రజినీ క్రేజ్..! ఉద్యోగులకు సెలవు, ఫ్రీ టికెట్స్‌...

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుండగా, మదురైలో ఓ కంపెనీ తలైవా అభిమానుల కోసం ఆ రోజున ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాదు, ఉచితంగా సినిమా టికెట్లు కూడా అందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ స్టార్ట్ అయ్యాయి.

New Update
Coolie

Coolie

Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ సినిమా ‘కూలీ’ ఆగస్టు 14న(Coolie on Aug 14) థియేటర్లలో విడుదల అవుతోంది. కాగా విడుదలకి ఇంకా 2 రోజులు మాత్రమే ఉండడంతో తలైవా అభిమానుల సందడి మొదలైంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కోసం ఓ రేంజ్‌లో హడావుడి జరుగుతోంది. అయితే ఓ కంపెనీ మాత్రం అభిమానుల  జోష్ ని డబుల్ చేస్తూ కూలీ చిత్రం విడుదల సందర్భంగా ఏకంగా తమ కంపెనీకి సెలవు ప్రకటించింది. అంతే కాదు తమ ఎంప్లాయిస్ కి ఫ్రీ టికెట్స్ కూడా ఇస్తోంది.

Also Read:‘కూలీ’కి ఇక్కడ 'A' సర్టిఫికెట్.. అక్కడ మాత్రం U/A.. షాక్ లో తలైవా ఫ్యాన్స్..!

Uno Aqua Care కంపెనీ సూపర్ గిఫ్ట్..

మదురైకి చెందిన Uno Aqua Care అనే కంపెనీ, తమ ఉద్యోగులందరికీ రజినీకాంత్ 'కూలీ' సినిమా విడుదల సందర్భంగా ఆగస్టు 14న సెలవు ప్రకటించింది. అంతేకాదు, ‘కూలీ’ సినిమా చూసేందుకు ఉచిత టిక్కెట్లు కూడా అందిస్తోంది. తమ కంపెనీలో పని చేసే ఎవరి మీద ఒత్తిడి లేకుండా, సినిమాను చూసి ఆనందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది.

ఈ సెలవు కేవలం మదురై బ్రాంచ్‌కి మాత్రమే కాదు, చెన్నై, బెంగళూరు, త్రిచీ, తిరునెల్వేలీ, చెంగల్పట్టు, మత్తుత్వాణి, అరపలయం బ్రాంచ్‌లకు కూడా సెలవులను ప్రకటించింది. తలైవర్ అభిమానిగా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రజనీకాంత్‌కు గౌరవంగా Uno Aqua Care సంస్థ, "50 ఇయర్స్ ఆఫ్ రజినిజం" పేరుతో మంచి పనులు కూడా చేస్తోంది. ఇందులో భాగంగా
అనాథాశ్రమాలకు భోజనం పంపిణీ, వృద్ధాశ్రమాల్లో మిఠాయిలు పంచడం, పైరసీని అడ్డుకోవడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. 

Also Read: కూలీలో మరో సర్ ప్రైజ్..యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!

అడ్వాన్స్ బుకింగ్స్‌.. (Coolie Advance Bookings)

‘కూలీ’ సినిమా విడుదలకు ముందే టిక్కెట్లు ప్రీ బుకింగ్స్ దుమ్ము దులుపుతోంది. ఒక్క ఇండియాలో మాత్రమే ₹5.55 కోట్లు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సేల్స్ జరిగాయి. బ్లాక్ సీట్లు కలుపుకుని మొత్తం ప్రీ బుకింగ్స్ ₹10.27 కోట్లకు చేరింది. ఇక విదేశాల్లో మాత్రం ₹37 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇవన్నీ కలిపితే ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది.

ఇక సినిమా విషయానికి వస్తే..

2025లో ఇటు తెలుగు ప్రేక్షకులు అటు తమిళు ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ‘కూలీ’, ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 171వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. పూర్తిగా యాక్షన్, డ్రామా, మాస్ మసాలాలతో మిక్స్ అయిన సినిమా కూలీ. కథ ప్రధానంగా గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతోందని తెలుస్తోంది.ఈ సినిమా లొకేష్ గత సినిమాల మాదిరిగా "లొకేష్ సినీ వర్సు" (LCU) లో భాగం కాదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇది కేవలం గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ కాదు డైరెక్టర్ లోకేష్ మనం ఊహించనిది ఇంకేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాను సన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు కలానిధి మారన్ నిర్మిస్తుండగా, సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన లభించింది. సినిమాటోగ్రఫీ గిరిష్ గంగాధరన్, ఎడిటింగ్‌ ఫిలోమిన్ రాజ్ పని చేస్తున్నారు. టెక్నికల్ టీమ్ అంతా కలిసి ఈ చిత్రాన్ని విజువల్ ట్రీట్‌గా రూపొందిస్తున్నారు.

తొలిసారి తమిళ్ సినిమాలో సౌబిన్..

అయితే రజనీకాంత్ ఈ సినిమాలో ఓ పాతకాలం కూలీ పాత్రలో కూడా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర యాక్షన్, ఎమోషన్, స్టైల్ అన్నీ కలిపిన మాస్ రోల్‌గా ఉండనుంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే, మలయాళ నటుడు సౌబిన్ షహీర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలిసారి తమిళ్ సినిమాల్లో అడుగుపెడుతున్న సౌబిన్, రజనీకాంత్‌ను తన నటనతో ఆశ్చర్యపరిచారట.

ఇంకా ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఉపేంద్ర 16 సంవత్సరాల తర్వాత తమిళ చిత్రాల్లో తిరిగి కనిపించబోతున్నారు. హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తున్నారు. ఆమె ఇందులో సత్యరాజ్ కుమార్తెగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. సత్యరాజ్, రజనీ కాంబినేషన్ లో గతంలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి దీంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది.

Also Read: 'కూలీ'తో కలిసి వస్తోన్న 'బాహుబలి'.. థియేటర్లు బ్లాస్ట్ పక్కా..!

ఇక సినిమాలో సర్‌ప్రైజింగ్‌గా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా  ఓ స్పెషల్ కేమియో పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకివ్వలేదు కానీ, ఆమిర్ ఖాన్ తాను కథ వినకుండానే ఓకే చేశానని చెప్పడం విశేషం. ట్రైలర్ లో చూపించిన ఆమిర్ ఖాన్ విజువల్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఇతర పాత్రల్లో రచిత రామ్, రేబా మోనికా జాన్, కాళి వెంకట్, జూనియర్ ఎంజీఆర్, మొనిషా బ్లెస్సీ తదితరులు ఉన్నారు.

మొత్తంగా చెప్పాలంటే, ‘కూలీ’ సినిమా స్టార్ కాస్టింగ్, మాస్ కథ, మ్యూజిక్, స్టైల్ అన్నింటినీ కలిపి ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, బుకింగ్ హడావుడి, కంపెనీల సెలవులు ఇలా అన్ని కలిపి తలైవర్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేశాయి. 

Also Read:తలైవా ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. ‘కూలీ’ మూవీ టికెట్ బుకింగ్స్ స్టార్ట్..

పోటీకి దిగుతున్న వార్ 2

‘కూలీ’కి పోటీగా Jr. NTR, హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న ‘వార్ 2’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. తలైవర్ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే ‘కూలీ’.. వార్ 2 కి గట్టి పోటీ ఇచేలా కనిపిస్తుంది.

తలైవర్ మేనియా స్టార్ట్!

ఈ ఏడాది రజనీకాంత్ అభిమానులకు ఇది ఒక ఫెస్టివల్. ఇప్పటికే చాలా చోట్ల 'కూలీ' ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇలా కంపెనీలు సెలవు, ఉచిత టిక్కెట్లు, సేవా కార్యక్రమాలతో ఈ కూలీ సినిమాను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. ఆగస్టు 14న థియేటర్లలో తలైవా మ్యాజిక్ చూడడానికి  మీరు కూడా రెడీ అయిపోండి!

Advertisment
తాజా కథనాలు