/rtv/media/media_files/2025/08/17/rachita-ram-2025-08-17-16-49-26.jpg)
Rachita Ram
Rachita Ram: సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన "కూలీ"(Coolie Movie) సినిమాతో తెలుగు, తమిళ ఆడియన్స్‌కు పరిచయమైన కన్నడ నటి రచితా రామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "కూలీ" సినిమాలో 'కళ్యాణి' అనే పవర్‌ఫుల్ నెగటివ్ పాత్రలో మెరిసిన ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున(Nagarjuna) లాంటి గ్రేట్ పెరఫార్మెర్స్ ని కూడా డామినెటే చేస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. కూలీ సినిమాలో తన పాత్రని చూసి మహానటి, అపరిచితురాలు అంటూ సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు. 'కళ్యాణి' అనే పాత్ర లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన రచితా రామ్ అసలు ఎవరు..? అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్. ఇంతకు ఎవరీ కన్నడ బ్యూటీ, తానూ చేసిన సినిమాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..
This picture was hidden in my gallery, waiting for the perfect moment to share! @rajinikanth sir, love you!♥️🧿 pic.twitter.com/iY6BHn4dGz
— Rachita Ram (@RachitaRamDQ) August 15, 2025
Also Read: "50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్ రిప్లై ఇదే..
'కూలీ'తో కోలీవుడ్ ఎంట్రీ..
ఆగస్ట్ 14న విడుదలైన ‘కూలీ’ సినిమా ద్వారా రచితా రామ్ తొలి సారి తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. అయితే ఇందులో రచితా రామ్ కీలక పాత్రలో కనిపించడం విశేషం. మొదటి సినిమాతోనే ఆమెకి భారీగా గుర్తింపు లభించింది.
రచితా రామ్ ఎవరు?
1992, అక్టోబర్ 3న బెంగళూరులో జన్మించిన రచితా రామ్ అసలు పేరు అర్చితా రామ్. ఆమె తండ్రి కే.ఎస్. రామ్ ఒక ప్రఖ్యాత భారతనాట్య కళాకారుడు. చిన్నప్పటి నుంచి నృత్యంపై ఆసక్తి ఉన్న రచితా, 50కి పైగా స్టేజీ షోలలో పాల్గొనడం జరిగింది. నాట్యం మీద ఉన్న ఆసక్తి ఆమెలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్కిల్స్‌ను కూడా పెంచింది.
— Rachita Ram (@RachitaRamDQ) June 24, 2025
Also Read:'కూలీ' బాక్సాఫీస్ రచ్చ.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ ప్రయాణం..
రచితా కెరీర్ 2011లో టెలివిజన్ ద్వారా మొదలైంది. ఆమె తొలి సీరియల్ ‘Benkiyalli Aralida Hoovu’ కాగా, 2013లో విడుదలైన ‘బుల్ బుల్’ సినిమాతో ఆమె కన్నడ చిత్రసీమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. అప్పటి నుంచే ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కన్నడలో రచ్చితా రామ్ "డింపుల్ క్వీన్"గా పేరొందింది. ఆమె ఉపేంద్ర, దర్శన్, గణేష్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. రంగీలా, రన్నా, చక్రవ్యూహ, సీతారాం కళ్యాణ వంటి హిట్ మూవీలతో బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసింది.
Also Read:రికార్డులు బద్దలు కొట్టిన రజినీ .. ఒక్కరోజుకే రూ. 150 కోట్లు!
ఇప్పటికే కన్నడలో స్టార్ స్టేటస్‌ను అందుకున్న రచితా, కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. "కూలీ" లాంటి బిగ్ ప్రాజెక్టుతో ఆమెకి తమిళ పరిశ్రమలో మంచి బ్రేక్ లభించింది. త్వరలోనే తెలుగులో కూడా ఆమెకి మంచి అవకాశాలు రానున్నాయి.
Also Read: అప్పుడే పైరసీ ఏంట్రా.. 'కూలీ', 'వార్ 2' HD ప్రింట్ లీక్!