/rtv/media/media_files/2024/12/06/3QLKOEfpqQcZDsiGrhY4.jpg)
keerthi suresh wedding card
Keerthy Suresh: స్టార్ నటి కీర్తి సురేష్ ఇటీవలే తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసింది. కీర్తి ఆమె చిన్ననాటి స్నేహితుడి ఆంటోనీని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి ఈ నెల 11-12న గోవాలో జరగనుంది. ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. కీర్తి సురేష్ ఫ్యామిలీకి కూడా ఆంటోనీ బాగా తెలిసినవాడేనని సమాచారం.
కీర్తి వెడ్డింగ్ కార్డ్ వైరల్
ఈ నేపథ్యంలో తాజాగా కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. వెడ్డింగ్ కార్డులో.. ఈనెల 12న మా కూతురి పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. జీవితంలో కొత్త అధ్యయనంలోకి అడుగుపెట్టబోతున్న ఈ కొత్త జంటకు మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదులు కావాలి.. మీ సురేష్ కుమార్, మేనక సురేష్ అని రాసుంది. అయితే నిజమైనదా.. లేదా ఎవరైనా సృష్టించిన వెడ్డింగ్ కార్డా..? అనేది తెలియదు.
🌟 Wedding bells are ringing! 💒 #KeerthySuresh & #Antony’s love story reaches its beautiful destination on Dec 12th! ❤️
— KLAPBOARD (@klapboardpost) December 4, 2024
Stay tuned for every enchanting detail! #KeerthyAntonyWedding pic.twitter.com/ySARSVkHBD
ప్రస్తుతం కీర్తి వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ చిత్రాలతో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు.
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్