pushpa2
Pushpa 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అల్లు అర్జున్ పుష్ప2. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 4న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతించగా.. ఏపీలో టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో సందిగ్ధత నెలకొంది.
Also Read: NTR హీరోయిన్ గా అచ్చ తెలుగు అందాలరాశి, కూచిపూడి నర్తకి 'వీణా రావు'
పవన్ ను కలిసిన పుష్ప2 టీమ్
అయితే తాజాగా ఈ విషయం పై పుష్ప2 మేకర్స్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో పుష్ప2 టికెట్ రేట్ల పెంపు, అధిక షోల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించాలని పుష్ప టీమ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల పెంపు పై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన జీవో ఈరోజు విడుదల చేసే అవకాశం ఉందట.
Also Read: సౌందర్యను అలా చేయడం బాధగా అనిపించింది.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్
పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాసిల్, ధనంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
Also Read: మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ.. 'అమరన్' ట్రైలర్ చూశారా