అయితే అది కేవలం సినిమాలోని పాత్రనే అయినప్పటికీ ముందుగా చేయడానికి ఇష్టపడలేదట. కానీ ఆ తర్వాత ఒప్పుకున్నారట. అంతే కాదు ఆ సినిమాలో నీలాంబరి పాత్ర కావాలా? సౌందర్య పాత్ర కావాలా? అని అడిగి ఉంటే సౌందర్య పాత్రనే కావాలని చెప్పేదాన్ని అని.. కానీ అలా జరగలేదని చెప్పారు రమ్యకృష్ణ. Image Credits: Ramya Krishnan/ Instagram
సౌందర్యను అలా చేయడం బాధగా అనిపించింది.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్
స్టార్ నటి రమ్యకృష్ణ 'నరసింహ' సినిమాలో తాను చేసిన నీలాంబరి పాత్రకు సంబంధించి ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో తెలియాలంటే పూర్తి ఆర్టికల్ చదవండి.
రజినీకాంత్ 'నరసింహ' సినిమా పేరు వినగానే హీరోయిన్ కంటే ముందుగా గుర్తొచ్చే పాత్ర నీలాంబరి. రజినీకాంత్ ప్రతినాయకురాలిగా 'నీలాంబరి' పాత్రలో రమ్యకృష్ణ కనబరిచిన నటన సినీ ప్రియులతో పాటు విమర్శకులను కూడా మెప్పింది.
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ నీలాంబరి పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Image Credits: Ramya Krishnan/ Instagram
'నరసింహా' లో నీలాంబరి పాత్ర చేయడం మొదట్లో రమ్యకృష్ణకు అసలు ఇష్టం లేదట. ఎందుకంటే ఆ పాత్రకు తల పొగరు ఎక్కువగా ఉన్నట్లు తీర్చిదిద్దారని. Image Credits: Ramya Krishnan/ Instagram
అయితే అది కేవలం సినిమాలోని పాత్రనే అయినప్పటికీ ముందుగా చేయడానికి ఇష్టపడలేదట. కానీ ఆ తర్వాత ఒప్పుకున్నారట. అంతే కాదు ఆ సినిమాలో నీలాంబరి పాత్ర కావాలా? సౌందర్య పాత్ర కావాలా? అని అడిగి ఉంటే సౌందర్య పాత్రనే కావాలని చెప్పేదాన్ని అని.. కానీ అలా జరగలేదని చెప్పారు రమ్యకృష్ణ. Image Credits: Ramya Krishnan/ Instagram
అలాగే సినిమాలో తాను సౌందర్య మొహం పై కాలు పెట్టే సన్నివేశం షూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని తెలిపింది.
అప్పట్లోనే తన పాత్రలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రమ్యకృష్ణ.. ఇక బాహుబలి తర్వాత పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. Image Credits: Ramya Krishnan/ Instagram
రమ్యకృష్ణ రీసెంట్ గా 'రంగమార్తాండ' ఎమోషనల్ డ్రామాలో నటించింది. ఈ సినిమాలో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటనకు ఫిల్మ్ ఫెయిర్ అవార్డు వరించింది. Image Credits: Ramya Krishnan/ Instagram