పుష్ప 2 థియేటర్‌లో విష ప్రయోగం.. వాంతులు, గొంతు నొప్పితో..!

మహారాష్ట్ర బాంద్రాలోని గెలాక్సీ థియేటర్‌లో పుష్ప 2 మూవీ స్క్రీనింగ్‌ సమయంలో అంతరాయం ఏర్పడింది. గుర్తు తెలియని వ్యక్తి సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు అంతరాయం కలిగించాడు. పెప్పర్ స్ప్రే ఉపయోగించడంతో ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బంది పడ్డారు.

New Update
pushpa 2 (9)

పుష్ప 2 మానియా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమా డిసెంబర్ 5న అంటే నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇందులో బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. ఊర మాస్ డాన్స్, అదిరిపోయే నటన, దుమ్ము దులిపే స్వాగ్, యాక్షన్ సీన్లు సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించాయి. 

Also Read: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి!

ఈ క్రమంలో కొన్ని చోట్ల ఈ మూవీ స్క్రీనింగ్‌కి అంతరాయం కలిగింది. చాలా చోట్ల థియేటర్ల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. మరికొన్ని చోట్ల టికెట్ల కోసం పోరాటాలు జరిగాయి. అది మాత్రమే కాకుండా సినిమా మధ్యలో అనవసరమైన గొడవలు, కొట్టుకోవడం, తన్నుకోవడం వంటివి చాలానే జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. 

Also Read: అన్నదాత సుఖీభవ...రైతుల అకౌంట్‌ లో రూ.20 వేలు!

థియేటర్‌లో విష ప్రయోగం

తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ థియేటర్లో సినిమా స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని ఓ దుండగుడు పెప్పర్ స్ప్రే ఉపయోగించాడు. దీంతో థియేటర్లలో ఉన్న వాళ్లంతా దగ్గు, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన తాజాగా మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు

మహారాష్ట్ర బాంద్రాలోని గెలాక్సీ థియేటర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు అంతరాయం కలిగించాడు. తీవ్ర అసౌకర్యానికి కారణం అయిన పదార్థాన్ని (పెప్పర్) స్ప్రే చేశాడు. దీంతో షో అర్దాంతరంగా ఆగిపోయింది. ఆ వ్యక్తి స్ప్రే చేయడంతో దాని నుంచి వచ్చిన కెమికల్‌కు ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యానికి గురయ్యారు. 

Also Read: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!

దగ్గు, గొంతు నొప్పి, చికాకు, వాంతులతో చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో వారందరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్ప్రే చేసిన వ్యక్తిని గుర్తించడానికి అలాగే స్ప్రే చేసిన ఆ పదార్థం ఏంటో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు