/rtv/media/media_files/2024/12/06/Tt4oNhufTD64xVsbsdqs.jpg)
SudhaMurthy: ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏది సాటిరాదని మరోసారి రుజువైంది.ఈ సారి ఏకంగా పార్లమెంట్ సమావేశాల్లో ఓ ఆసక్తికర సన్నివేశం జరగింది.రాజ్యసభలో సుధా మూర్తి మాతృ ప్రేమకు సభలో ఎంపీలు అందరూ బల్లలపై శబ్దం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయానమంత్రి రామ్మోహన్‌నాయుడు రాజ్యసభలో భారతీయ వాయు యాన్ విధేయక్ బిల్లును ప్రవేశ పెట్టారు.
Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు
గురువారం దాని మీద జరిగిన చర్చకు సమాధానమిస్తూ దాహార్తికి గురయ్యారు. వెంటనే మంచినీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ను అడిగారు. వెంటనే ఆయన స్పందించి నీళ్లు తీసుకురావాలని అక్కడ సిబ్బందికి చెప్పారు. సిబ్బంది నీరు తీసుకుని వచ్చేలోపు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి వెంటనే స్పందించారు.
Also Read: Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!
థాంక్యూ మేడం...
తన స్థానం నుంచి లేచి తన దగ్గర ఉన్న మంచినీళ్ల బాటిల్‌ను తెచ్చి రామ్మోహన్‌నాయుడికి అందించారు. సుధామూర్తి వాత్సల్యానికి ముగ్ధుడైన ఆయన ఆమెకు రెండుచేతులతో నమస్కరించి థాంక్యూ మేడం అంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఆమె ఎప్పుడూ తల్లిలా తనపట్ల ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: TS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
బిల్లుపై చర్చ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు ఇచ్చిన సమాధానానికి పలువురు సభ్యులు ఆయనకు అభినందరనలు తెలిపారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో సుధామూర్తి మాతృ ప్రేమకు అందరూ ఫిదా అయ్యారు.. నిజంగా ఆమె సింప్లిసిటీ గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దేశంలో కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవలకు విశిష్టమైన కృషి చేసినందుకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసే విషయం తెలిసిందే.
Also Read: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం భారీగా నిధులు విడుదల
ఆ క్రమంలోనే సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు సుధా మూర్తికి పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో కేంద్రం సత్కరించింది.