AP: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంపై ఓ కీలక ప్రకటన చేశారు. అన్నదాతలకు కేంద్రం ఏటా ఇచ్చే రూ.6 వేలతో కలిపి అన్నదాత సుఖీభవ పథం కింద మొత్తం రూ.20వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలిపారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చియార్డుపై సమీక్ష తర్వాత మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే మూడు నెలల పాటు మిర్చి సీజన్‌లో ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు అధికారులకు తెలిపారు. ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నామని తెలిపారు. అంతేకాదు కృష్ణా డెల్టాలో 30 రోజుల్లో రావాల్సిన ధాన్యం.. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు యంత్రాలతో నూర్పిడి చేసి.. కేవలం మూడు రోజుల్లోనే తీసుకొస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యమైనా అన్ని సమస్యలనూ అధిగమించి కొనుగోళ్లు చేస్తామని వివరించారు. త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
గుంటూరు మిర్చి యార్డులో రూ.350 కోట్ల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తెలిసిందని.. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా గుంటూరు మిర్చి యార్డు రైతులకు సేవలు అందిస్తుందన్నారు మంత్రి అన్నారు. రవాణాకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని.. మిర్చి యార్డులో మౌలిక సదుపాయాలు కచ్చితంగా కల్పించాలని తెలిపారు.
రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరో చోట విశాలమైన మిర్చి యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనువైన ప్రదేశం, స్థలం చూసి త్వరలో నూతన మిర్చి యార్డు నిర్మాణాన్ని చేపడతామని వివరించారు.ఏపీ ఎన్నికల సమయంలో కూటమి.. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద ఏడాదికి రైతులకు రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ పథకానికి త్వరలో మార్గదర్శకాల్ని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.20వేలు అందిస్తాము అంటున్నారు. ఈ మేరకు ఇటీవల 2024-25 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో భూమిలేని సాగుదారులకూ రూ.20,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
AP: అన్నదాత సుఖీభవ...రైతుల అకౌంట్ లో రూ.20 వేలు!
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తామని.. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 ఇస్తామన్నారు.
AP: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంపై ఓ కీలక ప్రకటన చేశారు. అన్నదాతలకు కేంద్రం ఏటా ఇచ్చే రూ.6 వేలతో కలిపి అన్నదాత సుఖీభవ పథం కింద మొత్తం రూ.20వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలిపారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చియార్డుపై సమీక్ష తర్వాత మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Ram Mohan Naidu: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి!
రాబోయే మూడు నెలల పాటు మిర్చి సీజన్‌లో ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు అధికారులకు తెలిపారు. ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నామని తెలిపారు. అంతేకాదు కృష్ణా డెల్టాలో 30 రోజుల్లో రావాల్సిన ధాన్యం.. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు యంత్రాలతో నూర్పిడి చేసి.. కేవలం మూడు రోజుల్లోనే తీసుకొస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యమైనా అన్ని సమస్యలనూ అధిగమించి కొనుగోళ్లు చేస్తామని వివరించారు. త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు
గుంటూరు మిర్చి యార్డులో రూ.350 కోట్ల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తెలిసిందని.. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా గుంటూరు మిర్చి యార్డు రైతులకు సేవలు అందిస్తుందన్నారు మంత్రి అన్నారు. రవాణాకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని.. మిర్చి యార్డులో మౌలిక సదుపాయాలు కచ్చితంగా కల్పించాలని తెలిపారు.
Also Read: Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!
రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరో చోట విశాలమైన మిర్చి యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనువైన ప్రదేశం, స్థలం చూసి త్వరలో నూతన మిర్చి యార్డు నిర్మాణాన్ని చేపడతామని వివరించారు.ఏపీ ఎన్నికల సమయంలో కూటమి.. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద ఏడాదికి రైతులకు రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ పథకానికి త్వరలో మార్గదర్శకాల్ని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు