/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-1-jpg.webp)
Sabarimala:కేరళలోని శబరిమలలో అయ్యప్పస్వామి వారి దర్శనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మండల-మకరవిళక్కు పూజల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు.
Also Read: Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాల వేసుకున్నవారితోపాటు సాధారణ భక్తులు.. అధిక సంఖ్యలో శబరిమలకు వెళ్తుండటంతో ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది.
Also Read: TS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
ఈ క్రమంలోనే తాజాగా మరికొన్ని రోజుల్లో 28 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓప్రకటనలో తెలిపారు.. ఈ 28 రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి నడవనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని మౌలాలి, కాచిగూడ నుంచి నడుస్తాయని సమచారం.
Also Read: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం భారీగా నిధులు విడుదల
కాచిగూడ నుంచి కొట్టాయం వరకు, హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం వరకు.. ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ టౌన్ నుంచి కొల్లం.. నర్సాపుర్ నుంచి కొల్లం స్టేషన్లకు ఈ రైళ్లు నడుస్తాయి. ఇక ఈ 28 స్పెషల్ ట్రైన్లు.. డిసెంబర్ 11వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు వివిధ తేదీల్లో సర్వీసులు నడవనున్నట్లు సమాచారం. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్స్ ఈనెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
Also Read: Champions Trophy : ఐసీసీ ట్రోఫీపై ఇంకా కొనసాగుతున్న సందిగ్ధత
రైళ్ల నంబర్లు, సర్వీసులందించే తేదీలు, టైమింగ్స్ వంటి వివరాలను అధికారులు ప్రకటించారు.కొల్లం నుంచి మౌలాలి డిసెంబర్ 13, 20, 27, మౌలాలి నుంచి కొల్లం డిసెంబర్ 14, 21, 28, కొల్లం నుంచి మౌలాలి డిసెంబర్ 16,కాకినాడ టౌన్ నుంచి కొల్లం జనవరి 6, 13,మౌలాలి నుంచి కొల్లం డిసెంబర్ 11, 18, 25, కొల్లం నుంచి కాకినాడ టౌన్ జనవరి 8, 15, నర్సాపూర్ నుంచి కొల్లం జనవరి 20, 27,కొల్లం నుంచి నర్సాపూర్ జనవరి 22, 29 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు అధికారులు వెల్లడించారు.