/rtv/media/media_files/2024/11/06/veFuUJEdUCBEg6OOAkLj.jpg)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' రిలీజ్ కు సరిగ్గా నెల రోజులే ఉంది. డిసెంబర్ 6 న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో న్యూ బెంచ్ మార్చ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. తాజాగా మరో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది.
Also Read : ఒకరు ఆవలిస్తే మనం ఎందుకు ఆవలిస్తాం..ఇది అంటువ్యాధా?
అప్పుడే 15 వేల టికెట్లు..
అదికూడా ఓవర్సీస్ లో కావడం విశేషం. సెంబర్ 4న ‘పుష్ప2’ ఓవర్సీస్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా దీని ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ రికార్డు స్థాయిలో అమ్ము డయ్యాయి. అత్యంత వేగంగా 15వేల టికెట్స్ అమ్ముడైనట్లు చిత్రబృందం తెలిపింది. భారతీయ చిత్రానికి అమెరికాలో ఇంత వేగంగా ఈ స్థాయిలో టికెట్స్ బుక్ కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
Also Read : అమెరికా వాళ్లు నెయ్యి, పెరుగు ఎందుకు తినరు..?
Shattering records, one at a time 💥💥#Pushpa2TheRule becomes the fastest Indian Film to sell 15K+ tickets in the USA ❤🔥
— Pushpa (@PushpaMovie) November 6, 2024
USA Premieres on 4th December 🤩
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/dFsrLtg5zV
Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!
ఈవిషయాన్ని తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
కాగా ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ లో శ్రీలీల.. అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేయనుంది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.