చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!

ఇటీవలే ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న బాలయ్యను.. కరణ్ జోహార్ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. టాలీవుడ్ స్టార్స్ చిరు, వెంకీ, నాగ్ లో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించారు. దీనికి బాలయ్య.. మరి షారుక్, సల్మాన్, అమీర్ లో మీ ఫేవరేట్ ఎవరంటూ కరణ్ కు చమత్కారంగా బదులిచ్చారు.

New Update
balayya

Balakrishna

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ళుగా తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. సినిమా ఏదైనా, ఈవెంట్ ఏదైనా జై బాలయ్య అనే స్లోగాన్ మాత్రం వినిపించేంత మాస్ ఇమేజ్ ఆయన సొంతం చేసుకున్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు బాలయ్య. 

Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్

చిరు, నాగ్, వెంకీలో ఎవరంటే ఇష్టం 

అయితే ఇటీవలే ఓ అవార్డు ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య తన కో స్టార్స్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవార్డు ఈవెంట్ లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్.. చిరు, నాగ్, వెంకీలో మీకు ఇష్టమైన హీరో ఎవరని? బాలయ్యను అడగగా.. దానికి ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. కరణ్ ఆ ప్రశ్న అడిగిన వెంటనే బాలయ్య.. మరి సల్మాన్, షారుక్, అమితాబ్ లో మీకు ఎవరు ఇష్టం అంటూ కరణ్ కు చమత్కారంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో అందరు సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాలయ్య 'టైమింగ్' మామూలుగా ఉండదు అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో మరో యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. #NBK అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..!

Also Read: బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు