ప్రముఖ ఓటీటీలో నాగచైతన్య- శోభిత పెళ్లి వీడియో

నాగ చైతన్య, శోభిత వెడ్డింగ్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 50 కోట్లతో వీరి పెళ్లి ప్రసారం హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. చై- శోభిత పెళ్లి సెంబర్ 4న అన్నపూర్ణ స్థూడియోస్ లో జరగనుంది.

New Update
Naga Chaitanya-Sobhitha

Naga Chaitanya- Sobhita Wedding

Naga Chaitanya- Sobhita: అక్కినేని ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ళ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్థూడియోస్ లోని ఏఎన్నార్ విగ్రహం ముందు వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే వివాహ ఆహ్వానానికి సంబంధించిన శుభలేఖలను కూడా పంచడం మొదలు పెట్టారు. నిశ్చితార్థం సింపుల్ కానిచ్చానా.. పెళ్లి మాత్రం ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు అక్కినేని కుటుంబం. వీరి పెళ్లికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు మొత్తం 300 మందికి పైగా గెస్టులు  హాజరు కానున్నట్లు సమాచారం. 

Also Read: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!

భారీ ధరకు నాగచైత్యన- శోభిత వెడ్డింగ్ ఫిల్మ్.. 

ఈ నేపథ్యంలో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల వెడ్డింగ్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 50 కోట్లతో వీరి పెళ్లి ప్రసారం హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో నాగచైతన్య వివాహంలో కఠిన ఆంక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతార- విఘ్నేష్ జంట పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా విడుదల చేసింది. దీని కోసం నయన్- విఘ్నేష్ జంటకు మేకర్స్  రూ.25 కోట్లు ఇచ్చినట్లు టాక్. వీళ్ళ తర్వాత OTTలో తమ వివాహ వీడియోను ప్రసారం చేయబోతున్న నెక్స్ట్ జంట నాగ చైతన్య,  శోభిత.

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

ఇది ఇలా ఉంటే.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయిపల్లవి- చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 7న విడుదల కానుంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో యదార్థ సంఘటనల ఆధారంగా  రూపొందిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. 

Also Read: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు