/rtv/media/media_files/2025/02/26/YMizNF9M4p8c6Ivq41cp.jpg)
Prabhu Deva son introducing video
Prabhu Deva son: సౌత్ ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా తన కొడుకును తొలిసారి తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ డాన్స్ కాన్సర్ట్ వేదికగా కొడుకు రిషి రాగ్వేందర్ దేవాను అభిమానులకు ఇంట్రడ్యూస్ చేశారు. కొడుకు తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియోను షేర్ చేస్తూ ప్రభుదేవా ఇలా రాసుకొచ్చారు. ''నా కొడుకు రిషి రాగ్వేందర్ దేవాను పరిచయం చేయడం గర్వంగా ఉంది. మొదటి సారి మేమిద్దరం కలిసి స్క్రీన్ పై కనిపిస్తున్నాము. ఇది కేవలం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. ఇది వారసత్వం.. ఇప్పుడే ప్రారంభమవుతున్న ప్రయాణం'' అని అన్నారు. ప్రభుదేవాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు రిషి రాగ్వేందర్ మరొకరు అదిత్.
Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!
ఇండియాస్ మైఖేల్ జాక్సన్ గా పిలువబడే ప్రభుదేవాతో కలిసి కుమారుడు రిషి రాగ్వేందర్ లెగ్ షేక్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా రిషిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అచ్చం ప్రభుదేవా మాదిరిగానే ఉన్నాడు, జూనియర్ మైఖేల్ జాక్సన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
రెండు జాతీయ అవార్డులు
ప్రభుదేవా తెలుగు, హిందీ, కన్నడ పలు భాషల్లో అనేక హిట్ పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాదు డైరెక్టర్ గా కూడా తనదైన ముద్ర వేశారు. ప్రేమికుడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పోకిరి(తమిళ్) వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!