/rtv/media/media_files/2025/11/20/raja-saab-bookings-2025-11-20-07-19-12.jpg)
Raja Saab Bookings
Raja Saab Bookings: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్’పై అభిమానుల్లో పెద్ద ఆసక్తి ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం జనవరి 9, 2026న సంక్రాంతి సందర్భంగా భారీగా విడుదల కానుంది. త్వరలో ఈ చిత్రంలోని తొలి పాట కూడా విడుదల కానుంది.
నార్త్ అమెరికా బుకింగ్స్ డిసెంబర్ 4 నుంచి ప్రారంభం
తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 4, 2025న ప్రారంభం అవుతున్నాయి. ప్రథ్యంగిరా సినీమాస్ ఈ ప్రాంతంలో రిలీజ్ బాధ్యతలు చేపట్టింది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు అక్కడ భారీ ఓపెనింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది.
Also Read: జపాన్‌లో ప్రభాస్ హంగామా.. 'బాహుబలి: ది ఎపిక్' రీ–రిలీజ్ స్పెషల్!
Inka #TheRajaSaab Release date midha vacchina Rumours annitiki check padinatte ga 😉
— Prabhas Fan (@ivdsai) November 19, 2025
Mana RAJA SAAB North America Bookings will be opened on December 04th, 2025. #Prabhas#JaiRebelStarpic.twitter.com/7IDcH67QR5
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరఫున టీజీ విష్ణు ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుండి అందుకే తప్పుకున్నా: దీపికా పదుకొణె
USA ప్రీమియర్స్‌కు భారీ అంచనాలు
జనవరి 8న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు జరుగనున్నాయి. ఈ ప్రీమియర్స్ సినిమాకు రికార్డు స్థాయి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడి ట్రేడ్ వర్గాల్లో ‘ది రాజా సాబ్’ ఎలాంటి ప్రీమియర్ వసూళ్లు సాధిస్తుందో అన్న చర్చలు ప్రారంభమయ్యాయి.
Also Read: పైరసీ చేసే కొడు*కుల్ని ఎన్ కౌంటర్ చేయాలి: నిర్మాత సి. కళ్యాణ్
ప్రభాస్ చిత్రాలు ఇంతకుముందు చేసిన వసూళ్లు చూస్తే, ఈసారి కూడా పెద్ద రికార్డు సాధించే అవకాశం ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. టాప్ ప్రీమియర్ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో Kalki 2898 AD, RRR, Pushpa 2, OG, Devara, Salaar, Baahubali 2 వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ భారీ జాబితాలో ‘ది రాజా సాబ్’ ఎక్కడ నిలుస్తుందో చూడాలి.
Also Read: కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్
ఫ్యాన్స్ లో భారీ హైప్
సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు ఊపందుకున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే టికెట్లు వేగంగా అమ్ముడవుతాయని అభిమానులు అంటున్నారు. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఒక కొత్త రికార్డు సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ టాప్ 3లోకి వెళ్తుందా? లేదా ఇంకా పెద్ద రికార్డు సాధిస్తుందా? అన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
Follow Us