Producer C Kalyan: తెలుగు చిత్ర పరిశ్రమ సినిమా పైరసీపై దృష్టి సారించింది. కొన్ని రోజుల క్రితం, సైబరాబాద్ పోలీసులు ఫేమస్ పైరసీ పోర్టల్ iBomma వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ అయిన ఇమ్మడి రవిను(iBomma Ravi) అరెస్టు చేసిన సంగతి ప్రేక్షకులకు, సినీ అభిమానులకు పెద్ద ఊరటను ఇచ్చింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీ.సి. సజ్జనార్‌ను కలిసి పోలీసుల పనితీరు పై అభినందనలు తెలిపారు.
/rtv/media/post_attachments/c10ae80c-2f8.png)
ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. చాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, నిర్మాత సి. కళ్యాణ్, చాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ, “పైరసీకి పాల్పడ్డవారిని అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, సీపీ సజ్జనార్‌కు ధన్యవాదాలు,” అన్నారు.
నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమా పైరసీ చేసే వారిని ఎన్ కౌంటర్ చేయాలి గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమాలో వందల మంది కష్టపడి పనిచేస్తారు. చాంబర్ పైరసీ సెల్ సరిగా పని చేస్తోంది. అంతే కాకుండా అంతర్జాతీయ సినిమాల పైరసీని కూడా వారు నిరోధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ నుండి కూడా మా ప్రయత్నాలను ప్రశంసించారు. ఇమ్మడి రవి టీమ్‌ను పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రణాళిక అద్భుతం. పోలీసులకు ధన్యవాదాలు,” అని తెలిపారు.
నిర్మాత చాదలవాడ శ్రీనివాస రావు, “సినిమా పైరసీ Qube, VFS వంటి ప్లాట్ఫారమ్‌ల నుండి జరుగుతుంది. నిర్మాతలు పర్యవేక్షణ చేయాలి. పెద్ద బడ్జెట్ సినిమాలు ఎక్కువ ధరలకు టిక్కెట్లు పెడితే, ప్రేక్షకులు చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకుంటారు. మనం కేవలం ఖరీదైన సినిమాలు కాకుండా, నాణ్యత కలిగిన సినిమాలు ఇవ్వాలి,” అని చెప్పాడు.
మొత్తానికి, తెలుగు పరిశ్రమలో సినిమా పైరసీని నియంత్రించడం కోసం చాంబర్, ప్రభుత్వం, పోలీసు శాఖలు కృషి చేస్తూనే ఉన్నాయి. ప్రతీ సినిమా తయారీకి కష్టపడే అందరి హక్కులు రక్షించడానికి, సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
Producer C Kalyan: పైరసీ చేసే కొడు*కుల్ని ఎన్ కౌంటర్ చేయాలి: నిర్మాత సి. కళ్యాణ్
తెలుగు ఫిల్మ్ చాంబర్ పైరసీపై సీరియస్ చర్యలు తీసుకుంటోంది. iBomma రవి అరెస్టు కావడం, పరిశ్రమలో కొంత ఊరట లభించింది, నిర్మాతలు, పోలీసులు కలిసి పైరసీ నియంత్రణపై చేస్తున్న కృషి iBomma రవి అరెస్టుతో ఫలించింది.
Producer C Kalyan