డార్లింగ్ ప్రభాస్ ఇంటర్వూలకు ఎంతో దూరంగా ఉంటాడు. ఎందుకంటే రెబల్ స్టార్ కు మొహమాటం ఎక్కువ. అందుకే ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఏదో సినిమా ప్రమోషన్ లో తప్పితే.. బయట ఎక్కువగా మాట్లాడడు. అప్పుడెప్పుడో బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోల్లో పాల్గొన్న డార్లింగ్.. మళ్ళీ ఇప్పటిదాకా ఇతర టాక్ షోలకు వెళ్ళలేదు.
Also Read : చైతూ - శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ చేసిన నాగార్జున.. ఎక్కడో తెలుసా?
అయితే రీసెంట్ గా ప్రభాస్.. ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబందించిన రెండో పార్ట్ తాజాగా విడుదలైంది. ఇందులో ప్రభాస్ తనకు ఇష్టమైన పాటల గురించి పంచుకున్నారు.ఈ క్రమంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Also Read : 'కాంతార' కోసం రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్.. రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్
ఈ మేరకు ప్రభాస్ మాట్లాడుతూ.." సిరివెన్నెల సినిమాలోని ‘విధాత తలపున ప్రభవించినది..’ పాట చాలా గొప్పగా ఉంటుంది. ‘సరసుస్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమిది’ లైన్స్ అంత బాగా ఎలా రాశారో.. సిరివెన్నెల గారు పెన్ను పెట్టగానే ఇలాంటి గొప్ప లిరిక్స్ వచ్చేస్తాయేమో. అలాగే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాట అంటే నాకు చాలా ఇష్టం.
Also Read : త్వరలో మళ్లీ పెళ్లి చేసుకుంటా
ఎక్కడికి వెళ్లినా ఆ పాటే..
ఆ పాట చరణంలో వచ్చే లైన్స్‌కు నేను వీరాభిమానిని. ప్రతి తరానికి సరిపోయేలా రాయడం సిరివెన్నెల గొప్పతనం. సాహిత్యానికి ప్రాధాన్యం ఉన్న పాటలు రాసిన ఆయనే.. ‘శివ’ సినిమాలో 'బోటనీ పాఠముంది' లాంటి టీజింగ్ సాంగ్ రాశారు. ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా. ఎక్కడికి వెళ్లినా ఈ పాటే పాడేవాడిని. ఇది సిరివెన్నెల గారు రాశారని తెలిసి ఆశ్చర్యపోయాను. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది.." అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్, నెటిజన్స్ డార్లింగ్ కి మాంచి మ్యూజిక్ సెన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Also Read : సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఫ్యామిలీతో తారక్ సందడి