/rtv/media/media_files/2024/11/04/yvvDwZlVBgmyHsgOwrAR.jpg)
హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలను శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
అప్పటినుంచి వీరి పెళ్లి ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. అధికారికంగా అయితే ప్రకటించలేదు. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట. కానీ, నాగార్జున ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్‌లోని ఓ మంచి ప్యాలెస్‌లో పెళ్లి చేద్దామని ఆలోచించారట.
Also Read : లేలేత సొగసు.. మిల మిల మెరిసిపోతున్న ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ
#NagaChaitanya and #Shobitha are set to tie the knot on December 4th in an elegant ceremony at Annapurna Studios. Their vows will be exchanged in a beautifully adorned mandapam, surrounded by loved ones.#SobhitaDhulipala pic.twitter.com/1Bl59Lp193
— Narendra News (@Narendra4News) November 4, 2024
Also Read : ప్రభాస్ ఆల్ టైం ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా?
అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి..
అయితే, ఇప్పుడు ఆ ప్లాన్‌ను కూడా నాగ్ వద్దనుకున్నారట. హైదరాబాద్‌లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకు వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేశారని సమాచారం. ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కు పనులు కూడా అప్పగించారని తెలుస్తోంది.
#NagaChaitanya and #Sobhita will tie the knot on DECEMBER 04 in a specially built mandapam at ANNAPURNA STUDIOS. pic.twitter.com/nWGY3oV1bg
— Gulte (@GulteOfficial) November 4, 2024
Also Read : త్వరలో మళ్లీ పెళ్లి చేసుకుంటా
త్వరలోనే చైతూ- శోభిత పెళ్లి డేట్, వెన్యూ తదితర వివరాలను అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా ఈ పెళ్లిని అక్కినేని ఫ్యామిలీ చాలా సింపుల్ గా ప్లాన్ చేశారట. ఎలాంటి ఆర్భాటాల్లేకుండా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులను మాత్రమే ఈ పెళ్ళికి పిలవనున్నట్లు అక్కినేని కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : 'కాంతార' కోసం రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్.. రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్