/rtv/media/media_files/2024/11/03/9c6hrWj7BYb7uIk35iux.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం అతని నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు.
Narne Nithiin marriage reception 🎊
— Nadiri Ravi (@NadiriRavi9999) November 3, 2024
Buddodu cuteness overloaded 😻@tarak9999 pic.twitter.com/oXMnLWQhGR
కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో తారక్ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక నార్నే నితిన్.. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు.
Also Read : 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..!
Tiger @tarak9999 Anna and family at #NarneNithin’s engagement function ♥️pic.twitter.com/smsWmcoqrP
— poorna_choudary (@poornachoudary1) November 3, 2024
గత ఏడాది 'మ్యాడ్' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత రీసెంట్ గానే 'ఆయ్' సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. ఆగస్టు నెలలోవిడుదలైన ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటూ హీరోగా నార్నే నితిన్ క్రేజ్ మరింత పెరిగింది.
NTR Annayya family at Narne Nitin’s Engagement
— Suthari_Naga _Ntr_9999 (@naga_suthari) November 3, 2024
Herooo with Family ❤️❤️❤️❤️❤️@tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/tKYPl9vizT
#NTR, #KalyanRam and #DaggubatiVenkatesh garu at Narne Nithin Engagement Function 💥🙌@tarak9999 @NANDAMURIKALYAN @VenkyMama pic.twitter.com/dPjZjbeDAJ
— TrendsKalyanRam (@TrendsKalyanRam) November 3, 2024
Also Read : స్టార్ హీరోల సినిమాల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే హీరోయిన్నే మార్చేస్తారు : తాప్సి