'కాంతార' కోసం రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్.. రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్ 'కాంతార' కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ను రంగంలోకి దింపారు. ఇన్ హెల్, రెడ్ ఫ్యాక్షన్ లాంటి హాలీవుడ్ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన టోడర్ లాజరోవ్ 'కాంతార' లో రెండు యాక్షన్ సీన్స్ తీస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రిషబ్ శెట్టి ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. By Anil Kumar 03 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'కాంతార' దేశ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో అద్భుత విజయన్ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ మూవీకి 2 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అందులో బెస్ట్ యాక్టర్ గా రక్షిత్ శెట్టి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు అందుకున్నాడు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో ఫైట్ సీన్స్.. కాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ గా 'కాంతార-1' తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలోని ఫైట్స్ కోసం హాలీవుడ్ కి చెందిన టోడర్ లాజరోవ్ ని తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం టోడర్ లాజరోవ్ తో రెండు యాక్షన్ సన్నివేశాలని తీస్తున్నట్లు సమాచారం. రిషబ్ శెట్టి తాజాగా ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. Also Read : సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఫ్యామిలీతో తారక్ సందడి కాగా టోడర్ లాజరోవ్ హాలీవుడ్ లో ఇన్ హెల్, రెడ్ ఫ్యాక్షన్ తదితర సినిమాలకి స్టంట్ మాస్టర్ గా పని చేశాడు. ఈయన తెలుగులో ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'RRR' సినిమాకి స్టంట్ మాస్టర్ గా పని చేశాడు. ఇప్పుడు రిషబ్ శెట్టి 'కాంతార' కోసం ఆయన్ని రంగంలోకి దింపుతున్నారంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. KGF, సలార్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. Also Read : 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..! View this post on Instagram A post shared by Todor Lazarov (@juji79) #rishab-shetty #kantara-prequel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి