Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

ప్రభాస్ 'సాహో' మూవీలో సమంతే హీరోయిన్ గా నటించాలట. సినిమాను అనౌన్స్ చేసిన టైం లో సమంతనే కథానాయికగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఏమైందో తెలీదు అనూహ్యంగా ఆ ఛాన్స్ బాలీవుడ్‌కి చెందిన శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది.

ps
New Update

సౌత్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ముఖ్యంగా టాలీవుడ్ లో సామ్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లతో ఆడిపాడిన ఈ ముద్దగుమ్మ ఒక్క ప్రభాస్ తో మాత్రం సినిమా చేయలేదు. వీరి కాంబో కోసం ఫ్యాన్స్ తో పాటూ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అది కుదరలేదు. 

దానికి రీజన్స్ ఏంటో కన్ఫర్మ్ గా తెలీదు కానీ, వీరిద్దరూ కలిసి నటించకపోవడానికి కారణం ప్రభాస్ హైట్ అని ఓ రూమర్ ఉంది.  ప్రభాస్ 6 అడుగులు ఉంటే, సమంత హైట్ 5.2 అడుగులు. ఈ కారణంగానే వీరిద్దరితో కలిసి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదని టాక్ వినిపించింది. నిజం చెప్పాలంటే ప్రభాస్ 'సాహో' మూవీలో సమంతే హీరోయిన్ గా నటించాలట.

Also Read : జానీ మాస్టర్ కు బెయిల్!

జస్ట్ మిస్..

'సాహూ' యాక్షన్ మూవీ కావడంతో డైరెక్టర్ సుజీత్ తో పాటూ మూవీ టీమ్ అంతా మొదట సామ్ అయితేనే కరెక్ట్ అని భావించారట. సినిమాను అనౌన్స్ చేసిన టైం లో సమంతనే కథానాయికగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఏమైందో తెలీదు అనూహ్యంగా ఆ ఛాన్స్ బాలీవుడ్‌కి చెందిన శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది. అలా వీరిద్దరి కాంబోలో రావాల్సిన ఒక్క సినిమా కాస్తా మిస్సైంది. 

ఇక ఆ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ డైరెక్టర్‌, ఏ ప్రొడ్యూసర్ వీరిద్దరి కాంబోను సెట్ చేసేందుకు ట్రై చేయలేదు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. అటు సమంత కూడా సౌత్ తో పాటూ హిందీలోనూ వెబ్ సిరీస్ లతో భారీ క్రేజ్ తెచ్చుకుంది. సో సామ్ కు కూడా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అయినా వీరి కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి.

Also Read :  ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Also Read :  అల్లు అర్జున్ అభిమానులకు భారీ షాక్ ! ఇక 'పుష్ప' లేనట్లే

Also Read :  మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్‌! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం

#tollywood #prabhas #actress-samantha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe