మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్‌! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం

రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మైనపు బొమ్మలో తన పెంపుడు జంతువు రైమ్ కూడా ఉండడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత విగ్రహంలో పెంపుడు జంతువును కలిగిన 2nd సెలబ్రిటీ రామ్ చరణ్.

New Update
ram charan 11

Ram Charan Madame Tussauds Wax Statue In Singapore

Ram Charan Wax Statue: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'RRR'  తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చరణ్ పేరు మారుమోగింది. తాజాగా ఈ గ్లోబల్ స్టార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన  IIFA 2024 అవార్డ్స్ వేడుకలో ప్రకటించారు. అంతేకాదు చలన చిత్రానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా  'మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డును' అందించారు. 

Also Read: ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

క్వీన్ ఎలిజబెత్ II తర్వాత చరణ్ 

అయితే ఈ మైనపు విగ్రహంలో తన పెంపుడు జంతువు రైమ్ కూడా ఉండడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత మైనపు విగ్రహంలో తమతో పాటు పెంపుడు జంతువును కూడా కలిగిన రెండవ సెలెబ్రెటీగా చరణ్ నిలిచారు. 2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు బొమ్మను రివీల్ చేయనున్నారు. ఈ సందర్భంగా చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

Also Read :  పైనాపిల్ తింటే అంతే సంగతి!

చరణ్ మాట్లాడుతూ.. 

"చిన్నప్పుడు మేడమ్ టుస్సాడ్స్‌లో చాలా మంది దిగ్గజ నటుల విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయేవాడిని. ఏదో ఒకరోజు వాళ్ళ మధ్య నేను కూడా ఉంటానని కలలో కూడా అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం. నా కళల పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. ఈ ప్రత్యేక అనుభూతిలో నా జీవితంలో ముఖ్యమైన భాగం.. రైమ్ కూడా నాతో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు చరణ్". 

Also Read :  ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Also Read: మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్ రియల్ స్టోరీ.. 'అమరన్' ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
తాజా కథనాలు