/rtv/media/media_files/2025/09/05/mirai-censor-2025-09-05-07-15-27.jpg)
Mirai Censor
Mirai Censor: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో "మిరాయ్" ఒకటి. ఫాంటసీ, యాక్షన్, పురాణాత్మక అంశాలతో కూడిన ఈ భారీ సినిమా 2025 సెప్టెంబరు 12న థియేటర్లలో విడుదల కానుంది(Mirai Release Date). ఈ టెక్నికల్ మాస్టర్ గా పేరుపొందిన కర్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజువల్ వండర్ గా రూపొందిన మిరాయ్, అద్భుతంగా ఉండబోతోందని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
కథ విషయానికొస్తే
ఈ కథ మోడ్రన్ ఫాంటసీ నేపథ్యంలో సాగుతుంది. చారిత్రకంగా ప్రసిద్ధుడైన సమ్రాట్ అశోకుని కాలానికి సంబంధించిన తొమ్మిది గుప్త గ్రంథాల చుట్టూ కథ తిరుగుతుంది. ఇవి సాధారణ మనిషిని దేవుడు స్థాయికి తీసుకెళ్లగల శక్తి కలిగినవి. అయితే, వాటిని చేజిక్కించుకోవాలని దుష్టశక్తుల కుట్రలు మొదలవడంతో, అప్పుడు మిరాయ్ అనే యువ యోధుడు ఈ పవిత్ర రహస్యాలను రక్షించడానికి తన లక్ష్యాన్ని తెలుసుకుని మిషన్‌లోకి దిగి, దుష్టశక్తులతో చేసే పోరాటమే మిగిలిన కథ.
Also Read: రిలీజ్‌కి ముందే OG రికార్డ్.. వేలంలో ఒక్క టికెట్ ధర రూ.5లక్షలు
తారాగణం & సాంకేతిక బలం
ఈ సినిమాలో తేజ సజ్జా(Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్(Manchu Manoj) విలన్ పాత్రలో కనిపించనున్నాడు, రితికా నాయక్, శ్రీయా శరణ్, జగపతిబాబు, జయరాం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరహరి సంగీతం అందించగా, People Media Factory సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఫుల్ స్వింగ్ లో "మిరాయ్" ప్రమోషన్స్..
ఈ సినిమా తెలుగు సినిమాగా రూపొందినా, దేశవ్యాప్తంగా హిందీ, తమిళం, మలయాళం, ఇతర భాషల్లో డబ్బింగ్ జరుగుతోంది. మూవీ టీమ్ ఇప్పటికే విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదల సందర్భంగా ఆన్‌లైన్, టీవీ, సోషల్ మీడియా వేదికలపై ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read: మహేష్ బాబు 'SSMB29' నుంచి సీన్ లీక్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అంతే!
సెన్సార్ పూర్తి.. (Mirai Movie Censor)
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి U/A 16+ సర్టిఫికేట్ పొందింది. 16 ఏళ్లు నిండినవారు తల్లిదండ్రుల సమక్షంలో చూడవచ్చు. ఇది యాక్షన్, థీమ్ కొంచెం ఎక్కువగా ఉన్నందున సెన్సార్ U/A 16+ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకి మొత్తం రన్ టైమ్ 169 నిమిషాలు (అంటే 2 గంటలు 49 నిమిషాలు) గా ఫైనల్ చేశారు. ఇక ప్రేక్షకులు రెండు గంటలకు పైగా ఒక అద్భుతమైన విజువల్ జర్నీకి సిద్ధంగా ఉండాల్సిందే..!