Prabhas Aadhar Card: వైరలవుతున్న  ప్రభాస్ ఆధార్ కార్డు.. డార్లింగ్  పూర్తి పేరు ఇంత పొడవా!

ప్రభాస్ ఆధార్ కార్డు అంటూ ఫొటో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. అలాగే ప్రభాస్ డేట్ ఆఫ్ బర్త్ 23 అక్టోబర్ 1979 అని ఉంది.

New Update
Prabhas Aadhar card

Prabhas Aadhar card

Prabhas Aadhar Card: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2, నాగశ్విన్ తో కల్కి పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'రాజాసాబ్'  చిత్రీకరణ ఇప్పటికే సగభాగం పూర్తవగా.. డిసెంబర్ 5న విడుదలకు సిద్దమవుతోంది. మిగతా సినిమాలు వచ్చే ఏడాదికి  విడుదల కానున్నట్లు సమాచారం.

ప్రభాస్ ఆధార్ కార్డు 

ఇక ప్రభాస్ సినిమాల గురించి పక్కన పెడితే.. ప్రభాస్ ఆధార్ కార్డు అంటూ ఫొటో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. అలాగే ప్రభాస్ డేట్ ఆఫ్ బర్త్ 23 అక్టోబర్ 1979 అని ఉంది. మరి ఈ  ఆధార్ కార్డు ఫొటో, ఇందులోని వివరాలు నిజమా ? లేదా ఫేకా అనేది  ధృవీకరించబడలేదు. అయినప్పటికీ ఈ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యూలేట్ అవుతోంది. ఇది  చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆధార్ కార్డులో ప్రభాస్  అప్పటి లుక్ చూసి మురిసిపోతున్నారు. ఆధార్ పిక్ లో కూడా ప్రభాస్ భలే ఉన్నాడే! అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే ప్రభాస్ వరుస లైనప్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవగా. .. మిగతా సినిమాల అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నారు. ప్రభాస్ గత సినిమాల్లో ఎప్పుడూ పోలీస్ పాత్రలో నటించలేదు. దీంతో డార్లింగ్ పోలీస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. అలాగే అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాల్లో హీరోలను ఒక  కొత్త యాంగిల్, బోల్డ్ క్యారెక్టర్స్ తో పరిచయం చేసిన వంగ.. స్పిరిట్ లో   ప్రభాస్ పాత్రను ఎలా డిజైన్ చేశారానే ఆసక్తి కూడా ఉంది. 

Also Read: SIIMA AWARDS 2025: సైమా వేడుకలో ఈ పిక్స్ గమనించారా .. పుష్ప టీమ్ హవా మామూలుగా లేదు!

Advertisment
తాజా కథనాలు